ఏ చెప్పులు.. ఎప్పుడు?

ఏ సందర్భానికైనా ఎత్తు చెప్పులే ఫ్యాషన్‌ అనుకుంటారు చాలా మంది. జీన్స్‌, మినీ, స్కర్ట్‌లకు బ్యాలేలు, ఫ్లాట్స్‌ వంటివి బాగుంటాయి. పైగా నడవడానికీ సౌకర్యం. ఎత్తు చెప్పుల్లో పాయింటెడ్‌ హీల్స్‌, స్టిలౌటీస్‌, వెడ్జ్‌లు... ఇలా రకాలెన్ని ఉన్నా దేనికదే ప్రత్యేకం.

Updated : 18 Jul 2023 05:04 IST

సందర్భానికైనా ఎత్తు చెప్పులే ఫ్యాషన్‌ అనుకుంటారు చాలా మంది. జీన్స్‌, మినీ, స్కర్ట్‌లకు బ్యాలేలు, ఫ్లాట్స్‌ వంటివి బాగుంటాయి. పైగా నడవడానికీ సౌకర్యం.

ఎత్తు చెప్పుల్లో పాయింటెడ్‌ హీల్స్‌, స్టిలౌటీస్‌, వెడ్జ్‌లు... ఇలా రకాలెన్ని ఉన్నా దేనికదే ప్రత్యేకం. వీటిని ఆయా దుస్తులకు జతగా ఎంచుకుంటేనే అందం. ముఖ్యంగా స్కర్ట్‌లకు పెన్సిల్‌ హీల్స్‌ బాగుంటాయి. పలాజోలు, ధోతీ ప్యాంట్లు వేసినప్పుడు వెడ్జ్‌ రకాలు బాగుంటాయి. మాక్సీలు, మినీలకు జతగా స్ట్రాపీ శాండిల్స్‌ నప్పుతాయి. ఇవే కాదు పంప్స్‌, కిటెన్‌ హీల్స్‌ వంటి వాటినీ సందర్భానుసారం ఎంచుకోవచ్చు.

ఇక జీన్స్‌ మీదకు స్నీకర్స్‌, యాంకిల్‌లెంత్‌, లెగ్గింగ్స్‌కు మ్యూల్స్‌, కట్‌అవుట్‌ షూ సరైన ఎంపిక. ఇవన్నీ సరే! మరి పార్టీల వేళప్పుడో అంటే సిల్వర్‌, రెడ్‌, గోల్డెన్‌ రంగుల్లో ఈవెనింగ్‌ శాండిల్స్‌ని ఎంచుకోవచ్చు. కుందన్లు, సీక్వెన్లు వంటి మెరుపులు మీ దుస్తులకు, ఆహార్యానికి అదనపు ఆకర్షణ తెచ్చిపెడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని