పూసలన్నీ వరసపోసి..

చేతిలో నైపుణ్యం, వినూత్నంగా ప్రదర్శించాలన్న తపన ఉంటే చాలు...దేన్నైనా అందంగా మార్చేయొచ్చు. అందుకు గురుగ్రామ్‌కి చెందిన ప్రియాన్షి ఓ ఉదాహరణ.

Published : 20 Jul 2023 00:01 IST

చేతిలో నైపుణ్యం, వినూత్నంగా ప్రదర్శించాలన్న తపన ఉంటే చాలు...దేన్నైనా అందంగా మార్చేయొచ్చు. అందుకు గురుగ్రామ్‌కి చెందిన ప్రియాన్షి ఓ ఉదాహరణ. చిన్నప్పుడు అమ్మ చేసిన పూసలు బొమ్మలు ఆమెకో మధుర జ్ఞాపకం. తన మనసుకి నచ్చిన వాటితోనే ఇప్పటి అమ్మాయిల అవసరాలను తీర్చాలనుకుంది. అంతే, వారి మనసుకు నచ్చేలా అందమైన నగలూ, యాక్సెసరీలను తయారు చేయడం ఆరంభించింది. ఎప్పటికప్పుడు మారే ట్రెండులను పట్టుకుని వారిని మెప్పిస్తోంది. అలాంటివే ఈ హెయిర్‌ క్లిప్స్‌. చూడచక్కని రంగుల్లో భలే ఆకట్టుకుంటున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని