చినుకు పడినా... చెదరకుండా

ఎంత చక్కగా మేకప్‌ వేసుకుంటే ఏం లాభం.. చినుకులకు కరిగి పోవాల్సిందేగా! ఈ చిట్కాలు పాటిస్తే.. తాజాగా ఉండే మేకప్‌ని సొంతం చేసుకోవచ్చు...

Updated : 21 Jul 2023 05:00 IST

ఎంత చక్కగా మేకప్‌ వేసుకుంటే ఏం లాభం.. చినుకులకు కరిగి పోవాల్సిందేగా! ఈ చిట్కాలు పాటిస్తే.. తాజాగా ఉండే మేకప్‌ని సొంతం చేసుకోవచ్చు...

మేకప్‌కు ముందు మ్యాటీ ప్రైమర్‌ రాయండి. ఇది చర్మాన్ని మేకప్‌కి అనువుగా మారుస్తుంది. అదనపు నూనెల ఉత్పత్తిని అడ్డుకుని, జిడ్డు రాకుండా చేస్తుంది. ఎక్కువ సేపు తాజాగానూ ఉంచుతుంది.

 లైట్‌ వెయిట్‌, వాటర్‌ప్రూఫ్‌ ఫౌండేషన్‌ని ఈ కాలంలో ఎంచుకోవాలి. ఇది మేకప్‌ని కరిగిపోకుండా చేస్తుంది.

 వీలైనంతవరకూ తక్కువ మేకప్‌ వేసుకోవడం మేలు. అయితే, ఆ భావన రాకుండా ఉండేందుకు కళ్లు, పెదాలను హైలైట్‌ చేయడం మంచిది. వాటర్‌ రెసిస్టెంట్‌ ఐషాడో, ఐలైనర్‌, మస్కారాలు మీ కళ్లను అందంగా కనిపించేలా చేస్తాయి. పాడవుకుండానూ ఉంచుతాయి.

 ఈ కాలంలో పెదాలకు బోల్డ్‌ షేడ్స్‌ బాగుంటాయి. మరీ కాంతిమంతంగా కనిపిస్తాయనుకుంటే సెమీ మ్యాటీ లిప్‌స్టిక్‌లను వాడండి. వర్షపు చినుకులకు పాడవకుండా స్మడ్జ్‌ ప్రూఫ్‌ రకాల్ని ఎంచుకోవాలి.

 ఈ కాలంతో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న నూనె మెరిసేలా చేస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి టాల్కం పౌడర్‌ వాడితే సరిపోతుంది. చివరగా మేకప్‌ ఎక్కువ సేపు తాజాగా ఉండేందుకు సెట్టింగ్‌ స్ప్రే చల్లండి. అలాగే జిడ్డుగా ఉన్నప్పుడు బ్లాటింగ్‌ పేపర్‌తో అద్దుకుంటే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని