ఎటువంటివి ధరించాలి..

వర్షం పడుతుంటే ఆఫీస్‌కు బయలుదేరాలి. బజారుకెళ్లి సామాన్లు కొనాలి. పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకురావాలి. చిత్తడిగా ఉండే ఈ వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండే దస్తులను ధరించాలంటున్నారు నిపుణులు.

Published : 22 Jul 2023 00:11 IST

వర్షం పడుతుంటే ఆఫీస్‌కు బయలుదేరాలి. బజారుకెళ్లి సామాన్లు కొనాలి. పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకురావాలి. చిత్తడిగా ఉండే ఈ వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండే దస్తులను ధరించాలంటున్నారు నిపుణులు. ఎంపికెలా చేసుకోవాలో చెబుతున్నారు.

అనుకోకుండా కురిసే వర్షంతో దుస్తులు తడుస్తాయి. చెమ్మగా ఉన్న వాటితో రోజంతా ఉండాలన్నా అనారోగ్యాలు దరిచేరతాయి. ఇలా కాకుండా ఉండాలంటే తేలికైన అవుట్‌ఫిట్స్‌ ఎంపిక సౌకర్యం. త్వరగా ఆరిపోయేలా ఉండాలి. దీనికి పరిష్కారం తేలికైన కాటన్‌. ఈ సీజన్‌కు ఇది సరైన ఎంపిక. తేలికగా, త్వరగా తడి ఆరేలా ఉంటుంది. అలాగే ములముల్‌ వస్త్రమైతే త్వరగా తడవదు. ఎక్కువ వర్షంలో తడిసినా త్వరగా ఆరిపోతుంది.

ఇలా ధరిస్తే..

కాటన్‌ టీ షర్ట్‌కు డెనిమ్‌ షార్ట్‌ జతగా నప్పుతుంది. అలాగే కాంతిమంతమైన వర్ణం కుర్తాకు లెగ్గింగ్‌ సరైన ఎంపిక అవుతుంది. మాన్‌సూన్‌ ఫ్రెండ్లీవేర్‌గా పిలిచే డెనిమ్‌ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ అవుట్‌ఫిట్స్‌ స్టైలిష్‌గానూ కనిపిస్తాయి. మినీ డ్రస్‌ లేదా షార్ట్‌, షోల్డర్‌ ప్యాడెడ్‌ టీ ధరిస్తే ఇంకా మంచిది. అలాగే ఖాదీ కూడా తేలికైన వస్త్రం. తడిసినా.. తేలికగా ఆరుతుంది. బయటికెళ్లినప్పుడు ఇబ్బంది ఉండదు. ఇక రేయాన్‌ వర్షాకాలంలో ధరించదగ్గ వస్త్రం. త్వరగా తడవదు. తడిసినా త్వరగా ఆరుతుంది.

వార్డ్‌రోబ్‌లో..

వర్షాకాలంలో దుస్తులను విడివిడిగా హ్యాంగర్స్‌కు వేసి ఆరబెడితే త్వరగా చెమ్మదనం దూరమవుతుంది. ఫ్యాన్‌ గాలికి ఆరనిచ్చినా మేలు. వాటిని వార్డ్‌రోబ్‌లో భద్రపరిచినప్పుడు కూడా అర అంగుళం చోటిస్తూ విడివిడిగా హ్యాంగర్స్‌కీ తగిలిస్తే మంచిది. తడి వాసన రావు. వీటి మధ్య అలమరలో నాఫ్తలిన్‌ బాల్స్‌ ఉంచితే దుర్వాసన ఉండదు.

యాక్ససరీస్‌..

లేతవర్ణాల యాక్ససరీస్‌ ముఖాన్ని పేలవంగా కనిపించేలా చేస్తాయి. నెక్‌ పీసెస్‌, బీడ్స్‌ బ్రాస్‌లెట్స్‌, లాంగ్‌ ఇయర్‌ రింగ్స్‌ నుంచి హ్యాండ్‌బ్యాగు వరకు బ్రైట్‌ కలర్స్‌ ఎంపిక మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని