డబుల్‌ చిన్‌ తగ్గాలా?

థైరాయిడ్‌, ఆ ప్రాంతంలో కొవ్వు చేరడం.. ఇలా డబుల్‌ చిన్‌ రావడానికి కారణాలెన్నో! అది వస్తేనేమో ముఖం అందంగా కనిపించదు. తగ్గించుకోవాలా.. ఈ వ్యాయామాలు ప్రయత్నించేయండి. నిటారుగా నిలబడి తలను కొద్దిగా వెనక్కి వంచి, సీలింగును చూడాలి.

Published : 24 Jul 2023 00:26 IST

థైరాయిడ్‌, ఆ ప్రాంతంలో కొవ్వు చేరడం.. ఇలా డబుల్‌ చిన్‌ రావడానికి కారణాలెన్నో! అది వస్తేనేమో ముఖం అందంగా కనిపించదు. తగ్గించుకోవాలా.. ఈ వ్యాయామాలు ప్రయత్నించేయండి.

నిటారుగా నిలబడి తలను కొద్దిగా వెనక్కి వంచి, సీలింగును చూడాలి. తర్వాత దాన్ని ముద్దాడినట్లు చేయాలి. ఇలా పదిహేను సార్లు చేసి నెమ్మదిగా యథాస్థితికి రావాలి. మళ్లీ తలను వెనక్కి వంచి ఇంటి పైకప్పును చూస్తూ నోరు వీలైనంత పెద్దగా తెరిచి ఒకటి నుంచి అయిదు లెక్కపెడుతూ నాలుకను బయట పెట్టాలి. తిరిగి ఐదు లెక్కపెడుతూ లోపలికి తీసుకోవాలి. ఇలా పది సార్లు చేయాలి.

నిటారుగా నిలబడి గడ్డాన్ని ఛాతీకి తగిలేలా తల వంచాలి. ఆపై మెల్లగా తలను కుడివైపునకు తిప్పాలి. ఈ స్థితిలో ఐదు సెకన్లు ఉండాలి. యథాస్థితికి వచ్చి రెండో వైపూ చేయాలి. ఇలా రోజూ పదిసెట్లు చేస్తే సరి.

మెడను నెమ్మదిగా అన్నివైపులూ కలిసేలా గుండ్రంగా నిమిషంపాటు తిప్పాలి. తర్వాత పూర్తిగా పైకీ, కిందకీ వెంటవెంటనే నిమిషంపాటు చేసినా గడ్డం కింద కొవ్వు కరుగుతుంది. తరచూ నవ్వడం లాంటివి చేసినా ముఖానికి వ్యాయామమేనట. గుర్తుంచుకొని నవ్వితే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని