తల తడిస్తే..

జుట్టురాలే సమస్య మిగతా కాలాలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ. అధిక తేమ, వర్షంలో తడవడం మూలంగా దృఢత్వం తగ్గి జుట్టు ఎక్కువగా రాలి పోతుంటుంది.

Published : 26 Jul 2023 00:25 IST

జుట్టురాలే సమస్య మిగతా కాలాలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ. అధిక తేమ, వర్షంలో తడవడం మూలంగా దృఢత్వం తగ్గి జుట్టు ఎక్కువగా రాలి పోతుంటుంది. అలా కాకుండా ఉండాలంటే..

  • వానాకాలంలో వారానికి రెండు సార్లు తలస్నానం చేయడం మంచిది. దీనివల్ల కుదుళ్లలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు నివారించవచ్చు.
  • తలను తుడవటానికి మెత్తని కాటన్‌ వస్త్రాన్ని లేదా తడిని పీల్చే మైక్రోఫైబర్‌ టవల్‌ని ఉపయోగిస్తే మంచిది.
  • జుట్టుకు తగిన పోషకాలు అందించే సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమం. మొలకలు, ప్రొటీన్లు, బాదం వంటి డ్రైనట్స్‌ తీసుకోవాలి.
  • ఎక్కువ గాఢత కలిగిన డై, కలర్‌ వంటివి వీలైనంత వరకు తగ్గిస్తేనే మంచిది.
  • స్టైలింగ్‌ కోసం హెయిర్‌ స్ట్రైట్‌నర్‌ వంటి పరికరాలు వాడితే వాటి నుంచి వెలువడే వేడి జుట్టుని బలహీనం చేస్తుంది. వెంట్రుకలు తెగిపోతాయి.
  • జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండాలంటే వారానికి మూడు సార్లు మాడుని గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దనా చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని