చినుకు కాలంలో చక్కని ప్యాక్‌లు!

ఈ సీజన్‌లో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల  చర్మం పై జిడ్డు పేరుకుపోతుంది. ముఖం పై మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువ.

Published : 27 Jul 2023 00:02 IST

ఈ సీజన్‌లో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల  చర్మం పై జిడ్డు పేరుకుపోతుంది. ముఖం పై మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ చిట్కాలు పాటిస్తే చర్మాన్ని తాజాగా ఉంచుకోవచ్చు..

 గ్రీన్‌టీ మాస్క్‌.. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యాన్నే కాదు, చర్మ సౌందర్యాన్నీ కాపాడతాయి. రెండు చెంచాల గ్రీన్‌ టీ పొడికి, చెంచా పెరుగు, రెండు చుక్కల బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖంపై ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే సరి. మొటిమలు, వాటి వల్ల వచ్చే దురదను నివారించవచ్చు.

పుదీనా... ఇది అందాన్నీ, ఆరోగ్యాన్నీ కలిపి అందిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. దీనికి సగం అరటిపండుని కలిపి మెత్తగా మెదిపి గుజ్జులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకీ ప్యాక్‌లా వెయ్యాలి. 15 నిమిషాలు ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మ సమస్యలు రావు. పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఇన్‌ఫెక్షన్లు  రాకుండా చేస్తాయి.

 తులసి... ముఖంపై నల్లని మచ్చలను నివారించడంలో తులసి బాగా పని చేస్తుంది. గుప్పెడు తులసి ఆకుల రసానికి అంతే మోతాదులో నిమ్మరసం కలిపి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి. రోజుకి ఒక సారి ఇలా చేస్తే ముఖంపై ఉండే నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి.

 రోజ్‌ వాటర్‌... పావుకప్పు రోజ్‌వాటర్‌ తీసుకుని స్పూన్‌ పసుపు, పావు టీస్పూన్‌ చందనం పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై మృదువుగా మర్దనా చేస్తూ రాయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే సరి. ఈ ప్యాక్‌ వెయ్యడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగి తేటగా కనిపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని