లోపలి మెరుపు!

అందంగా కనిపించాలి.. మేను మెరిసిపోవాలి అనేది ప్రతి అమ్మాయి కోరికే! దానికి ఎంతసేపూ ఖరీదైన క్రీములపైనే ఆధారపడితే సరిపోదు. లోపలి నుంచీ సహజ మెరుపు కావాలి. కాబట్టి.. బాదం.. విటమిన్‌ ఇ దీనిలో పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మకణాలు దెబ్బతినకుండా కాపాడటమే కాదు..

Published : 29 Jul 2023 00:08 IST

అందంగా కనిపించాలి.. మేను మెరిసిపోవాలి అనేది ప్రతి అమ్మాయి కోరికే! దానికి ఎంతసేపూ ఖరీదైన క్రీములపైనే ఆధారపడితే సరిపోదు. లోపలి నుంచీ సహజ మెరుపు కావాలి. కాబట్టి..

బాదం.. విటమిన్‌ ఇ దీనిలో పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మకణాలు దెబ్బతినకుండా కాపాడటమే కాదు.. తేమనీ బంధిస్తుంది. ముడతల్ని రాకుండా అడ్డుకుంటుంది. రోజుకి 6-10 తీసుకుంటే సరి. గుండెకీ ఆరోగ్యం.. కురులూ దృఢమవుతాయి.

డార్క్‌ చాక్లెట్‌.. కోకో ఎక్కువగా ఉన్నవాటిని ఎంచుకొని రోజూ ఓ చిన్న ముక్క తినండి. దీనిలో ఫ్లావనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతూనే సాగే గుణాన్నీ మెరుగుపరుస్తాయి.

పాలు.. ఒక చిన్నగ్లాసు పాలలో చిటికెడు పసుపు కలుపుకొని రోజూ తాగండి. ఈ చిట్కా ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతూనే ఛాయను మెరుగుపరచడంలోనూ సాయపడుతుంది. గోరువెచ్చగా పరగడుపున ప్రయత్నించండి. గ్రీన్‌ టీ.. చర్మం సాగే గుణాన్ని మెరుగుపరచడమే కాదు మృదుత్వాన్ని అందించడంలోనూ దీనిలోని గుణాలు సాయపడతాయి. రోజూ లీటరు నీళ్లు.. కప్పు గ్రీన్‌ టీ దినచర్యలో తప్పనిసరి చేసుకుంటే సరి.

పెరుగు.. పెరుగుకి రెండు మూడు రకాల పండ్ల ముక్కలు జోడించుకొని అల్పాహారంలో తింటే చర్మం బాగుంటుంది.
టొమాటో.. దీనిలోని లైకోపిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ చర్మానికి మృదుత్వాన్నిచ్చే కొల్లాజెన్‌ ఉత్పత్తికి సాయపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని