రంగు పడుద్ది జాగ్రత్త!

వయసుతో సంబంధం లేకుండా తల నెరుపు అందరికీ సమస్యగా మారింది. కొందరు దాచేయడానికి డైలు వాడుతుంటే, ఇంకొందరేమో స్టైలింగ్‌ పేరుతో జుట్టుకి స్ట్రీకింగ్‌ చేస్తున్నారు. అయితే, ఇలా రంగు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి.

Published : 01 Aug 2023 00:40 IST

వయసుతో సంబంధం లేకుండా తల నెరుపు అందరికీ సమస్యగా మారింది. కొందరు దాచేయడానికి డైలు వాడుతుంటే, ఇంకొందరేమో స్టైలింగ్‌ పేరుతో జుట్టుకి స్ట్రీకింగ్‌ చేస్తున్నారు. అయితే, ఇలా రంగు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. అవేంటంటే..

♥  ముందు మీ జుట్టు స్థితిని పరిశీలించండి. చుండ్రు ఉందా? రాలుతోందా? ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నాయా వంటివన్నీ చూసుకొని.. ఇవేమీ లేవనుకున్నాకే డై జోలికి వెళ్లండి. అయితే అది మీకు సరిపడుతుందో లేదో ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

♥  డైలల్లో రసాయనాల మోతాదు ఎక్కువ. ముఖ్యంగా పీపీడీ, అమోనియా వంటివి లేని రకాలను ఎంచుకోండి. లేదంటే ఇవి రక్తంలో చేరి, అనారోగ్యాలకు కారణం అవుతాయి. అలానే షాంపూల్లో కూడా సల్ఫేట్లు లేనివి లేదా కలర్‌ సేఫ్‌ రకాలని ఎంచుకోవాలి.

♥  జుట్టు బలహీనంగా ఉన్నప్పుడు డై వేయకపోవడమే మంచిది. ముందు దానికి తగిన పోషణ అందించాలి. అలానే రంగు వేయాలనుకున్నప్పుడు కొన్నిరోజుల పాటూ తలకి ఏ ఇతర రసాయన ఉత్పత్తులనూ వాడక పోవడం మంచిది.

♥  డై వేయాలనుకునే రెండు రోజుల ముందు నుంచీ రోజూ తలస్నానం చేసి కురులకు నాణ్యమైన కండిషనర్‌ని రాయండి. ఆ తర్వాత డై వేస్తే వెంట్రుకలు పాడవకుండా ఉంటాయి. రంగూ చక్కగా పడుతుంది. అలాగే వేడి వేడి నీళ్లతో తలస్నానం చేసే అలవాటుంటే మానుకోండి. లేదంటే కురులు పాడవడమే కాదు రంగూ త్వరగా వెలిసిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని