గిల్టు నగలు పడట్లేదా?

ఎన్ని నగలు, చీరలున్నా కొత్తవి కనిపిస్తే అవీ కావాలనిపిస్తుంది. కొత్త దుస్తులపైకి.. మ్యాచింగ్‌ నగలు కొనేస్తాం. అన్నీ బంగారమే కొనలేం కాబట్టి గిల్టువి తీసుకుంటాం.

Published : 02 Aug 2023 00:01 IST

ఎన్ని నగలు, చీరలున్నా కొత్తవి కనిపిస్తే అవీ కావాలనిపిస్తుంది. కొత్త దుస్తులపైకి.. మ్యాచింగ్‌ నగలు కొనేస్తాం. అన్నీ బంగారమే కొనలేం కాబట్టి గిల్టువి తీసుకుంటాం. కానీ చాలా మందికి అవిపడవు. అలర్జీలు వస్తుంటాయి. వాటిని తగ్గించేయండిలా...

  • వీటిని ధరించే ముందు మాయిశ్చరైజర్‌, పౌడర్‌, పెట్రోలియం జెల్లీ రాసి వేసుకుంటే సమస్య ఉండదు.
  • వేసుకున్న తర్వాత శుభ్రపరచకుండా అలాగే దాచిపెడుతున్నారా? వీటిపై చేరే దుమ్ము, చెమట వల్ల నగలు త్వరగా పాడవ్వడమే కాదు అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వేసుకున్న తర్వాత వీటిని బ్రష్‌ లేదా మెత్తటి వస్త్రంతో శుభ్రం చేసి భద్రపరచాలి.
  • కొంతమందిలో ఇవి వేసుకుని తీసిన తర్వాత మంట, దురద, దద్దుర్లు, చర్మం నల్లగా మారడం లాంటివి కనిపిస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే  కింది భాగాన పారదర్శకంగా ఉండే రంగు వేస్తే సమస్య ఉండదు. మార్కెట్లో ప్లాటినం కోటింగ్‌ అని వేస్తారు. అది వేయించుకున్నా మంచిదే. అలాగే దురద అనిపించిన చోట కలబంద గుజ్జును రాయాలి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని