మొటిమలకు మునగాకు
పీసీఓడీ, రక్తహీనత, మొటిమలు, బ్లాక్‌హెడ్స్.. ఇలా మనల్ని వేధించే సమస్యలెన్నో. వీటన్నింటికీ మునగాకుతో చెక్ చెప్పొచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ ఆకుతో పిల్లల్నీ అనారోగ్యాల బారి నుంచి కాపాడుకోవచ్చట.
పీసీఓడీ, రక్తహీనత, మొటిమలు, బ్లాక్‌హెడ్స్.. ఇలా మనల్ని వేధించే సమస్యలెన్నో. వీటన్నింటికీ మునగాకుతో చెక్ చెప్పొచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ ఆకుతో పిల్లల్నీ అనారోగ్యాల బారి నుంచి కాపాడుకోవచ్చట.
♥ మునగాకులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఐరన్, క్యాల్షియం మెండుగా ఉంటాయి. దీనిలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది.
♥ గర్భిణులు రోజూ తగు మోతాదులో దీన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఐరన్, క్యాల్షియం పుష్కలంగా అందుతాయి. పుట్టబోయే బిడ్డా ఆరోగ్యంగా ఉంటుంది. బాలింతలకు పాలు సమృద్ధిగా పడతాయి.
♥ గుప్పెడు మునగాకు తీసుకుని లీటరు నీటిలో వేసి మరిగించాలి, చల్లార్చిన తర్వాత ఆ నీటిలో కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం వేసి క్రమం తప్పకుండా తాగితే ఆస్తమా తగ్గుముఖం పడుతుంది.
♥ మునగాకుల్ని వేడి నీటిలో వేసి మూత పెట్టాలి. అరగంట తర్వాత ఈ నీటిలో కాస్త నిమ్మరసం పిండి ఖాళీ కడుపుతో తాగితే పీసీఓడీ సమస్య నియంత్రణలోకి వస్తుంది.
♥ ఒక చెంచా మునగాకు రసంలో చెంచా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి.
♥ కొబ్బరి నీళ్లల్లో చెంచా మునగాకు రసాన్ని కలిపి తాగితే విరేచనాలకు మంచి ఔషధంలా పని చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.