కాఫీ మాస్క్‌తో మెరిసిపోదామిలా!

పనులు రీత్యా ఎండలో తిరగడం సహజం. సూర్యరశ్మి తగలడం వల్ల కొందరిలో మెలనిన్‌ ఉత్పత్తి పెరుగుతోంది. దాంతో ముఖంపై నల్లమచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడతాయి. వీటిని నివారించడానికి సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడుతుంటాం.

Updated : 09 Aug 2023 16:14 IST

పనుల రీత్యా ఎండలో తిరగడం సహజం. సూర్యరశ్మి తగలడం వల్ల కొందరిలో మెలనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో ముఖంపై నల్లమచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడతాయి. వీటిని నివారించడానికి సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడుతుంటాం. అవి ఆపేస్తే మళ్లీ మొదలవుతాయి. పైగా  ఇది ఖర్చుతో కూడుకున్న పని కూడా. అలా కాకుండా వంటింట్లో దొరికే వస్తువులతోనే వీటిని నియంత్రించవచ్చు. అదెలా అంటే...

తేనె-కాఫీ..

టేబుల్‌స్పూన్‌ కాఫీ పొడికి అదే పరిమాణంలో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆగి చల్లటి నీటితో శుభ్రం చేస్తే సరి. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తాయి.

పాలతో..

ఒక స్పూన్‌ కాఫీ పొడికి రెండు టేబుల్‌ స్పూన్ల పాలు కలిపి పేస్ట్‌ చెయ్యాలి. దీన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేస్తే సరి. పాలల్లో ఉండే లాక్టిక్‌ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

అలోవెరా మాస్క్‌..

కలబంద గుజ్జు, కాఫీపొడి సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసి, ఆరాక చల్లటి నీటితో కడిగితే ఫలితం ఉంటుంది. ఇది ముఖానికి తేమను అందిస్తుంది.

బ్రౌన్‌షుగర్‌ స్క్రబ్‌..

అరటీస్పూను కాఫీ పొడి, అదే పరిమాణంలో బ్రౌన్‌షుగర్‌, కొబ్బరినూనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోముకి పట్టించి పది నిమిషాలు మృదువుగా స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లైనా చేస్తే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని