అందానికి.. హంగుల ట్రౌజర్లు!
మూడు ముళ్లు పడే ముచ్చటైన సమయం ఆసన్నమై.. పడతుల హృదయాలను గిలిగింతలు పెట్టే శ్రావణమాస సందడి రానే వచ్చింది. స్నేహితురాళ్ల రిసెప్షన్, హల్దీ ఫంక్షన్, పెళ్లి.. అంటూ జీవితంలో గుర్తు పెట్టుకొనేవాటెన్నింటికో హాజరుకావాల్సి ఉంది.
మూడు ముళ్లు పడే ముచ్చటైన సమయం ఆసన్నమై.. పడతుల హృదయాలను గిలిగింతలు పెట్టే శ్రావణమాస సందడి రానే వచ్చింది. స్నేహితురాళ్ల రిసెప్షన్, హల్దీ ఫంక్షన్, పెళ్లి.. అంటూ జీవితంలో గుర్తు పెట్టుకొనే వాటెన్నింటికో హాజరుకావాల్సి ఉంది. ఇప్పుడే ఆహార్యానికి మరింత అందాన్ని, ఆకర్షణనూ అందించే ట్రౌజర్స్ ఎంపిక నలుగురిలో మరింత ప్రత్యేకతను అందిస్తుంది. దీనికి తగినట్లుగానే డిజైనర్లు కూడా తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తున్నారు. టాప్‌కుండే హంగులను ట్రౌజర్‌కూ అద్దుతున్నారు.
3డీగా..
చమ్కీలు, ముత్యాలు పొదిగి పూలరేకుల అందాన్ని 3డీగా తీర్చిదిద్ది మరీ ట్రౌజర్స్‌కు కొత్తదనాన్నిస్తున్నారు. 3డీ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో మరింత ఆకర్షణీయంగా కనిపించేలా రూపొందిస్తున్నారు. బూట్‌కట్, బెల్ మోడల్స్ ట్రౌజర్స్ అంటూ ఏ మోడల్‌కైనా.. ఈ హంగులద్దడంతో కొత్త ట్రెండ్‌తో ఇవి పోటీ పడుతున్నాయి. రంగురంగుల రాళ్లు, జెమ్స్‌తో ట్రౌజర్స్ ఇప్పుడు మెరుపులీనుతున్నాయి.
సంప్రదాయంగా..
మోడర్న్ ఎంబ్రాయిడరీతో ట్రెడిషనల్ కట్‌గా వస్తున్న ట్రౌజర్స్ ప్రస్తుతం నయా ఫ్యాషన్‌గా నిలుస్తోంది. ట్రెండీగానూ కనిపిస్తున్నాయి. మృదువుగా, మెరిసే వెల్వెట్‌పై వెండి పోగుల్లాంటి ఎంబ్రాయిడరీ మెరుస్తూ.. ట్రౌజర్‌కు మరింత అందాన్నిస్తుంటే ఏ వేడుకకైనా ఇది ఇట్టే నప్పుతుంది. అలాగే బూట్‌కట్ డ్రూడ్రాప్, సిగరెట్ ట్రౌజర్స్ కూడా నేటి తరం మనసును దోచేస్తున్నాయి. దీంతోపాటు ఫ్లోరల్ ప్యాచ్ వర్క్ సాయంకాలాల పార్టీలకు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.