గోరంత అందం
చేతి గోళ్లను అందంగా పెంచి, రంగురంగుల నెయిల్ పాలిష్ వేసి మురిసిపోవాలనుకుంటాం. కానీ కొందరికి ఇంట్లో పనులు, విటమిన్స్ లోపం వల్ల తరచూ విరిగిపోతుంటాయి.
చేతి గోళ్లను అందంగా పెంచి, రంగురంగుల నెయిల్ పాలిష్ వేసి మురిసిపోవాలనుకుంటాం. కానీ కొందరికి ఇంట్లో పనులు, విటమిన్స్ లోపం వల్ల తరచూ విరిగిపోతుంటాయి. వీటిని ఇంటి చిట్కాలతోనే దృఢంగా ఉంచొచ్చు. అది ఎలానో చూద్దాం..
వెల్లుల్లి నూనె: కాసిని వెల్లుల్లి రెబ్బలని కచ్చా పచ్చాగా దంచి కొబ్బరి నూనెలో వేసి మరిగిస్తే వెల్లుల్లి నూనె సిద్ధం. దీన్ని గోళ్లకు మర్దనా చేయాలి. తరచూ చేస్తే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. దృఢంగానూ మారతాయి.
గుడ్డు పెంకులు: వీటిని పారేస్తుంటాం కానీ ఇవి చేతి గోళ్లను దృఢంగా ఉంచుతాయి. కొన్ని గుడ్డు పెంకులను తీసుకొని శుభ్రంగా కడిగి, మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు కలిపి గోళ్లకు అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే గోళ్లు బలంగా, వేగంగా పెరుగుతాయి.
నిమ్మరసం: రోజూ నిమ్మరసాన్ని చేతి గోళ్లకు రుద్దుతూ ఉండాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి. నిమ్మకాయలోని విటమిన్ సి గోళ్లలోని బాక్టీరియాను తొలగించి దృఢంగా ఉంచుతుంది.
కొబ్బరి నూనె: ఈ నూనెను గోరువెచ్చగా వేడిచేసి చేతిగోళ్లకు అద్దుతుండాలి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కలిగి గోళ్లను మెరిసేలా చేస్తాయి. రాత్రి నిద్ర పోయే ముందు కొబ్బరి నూనె రాసుకుంటే ఫలితం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.