పాత లెగ్గింగ్స్‌ను పారేస్తున్నారా?

ఎలాస్టిక్‌ సాగిపోయిందనో, రంగు పోయిందనో, చాలా రోజుల నుంచి వాడుతున్నామనో పాత లెగ్గింగ్స్‌ను పారేస్తుంటాం. కాస్తంత సమయం కేటాయిస్తే వాటిని తిరిగి వినియోగించుకునేలా సిద్ధం చేసుకోవచ్చు.

Published : 13 Aug 2023 00:14 IST

ఎలాస్టిక్‌ సాగిపోయిందనో, రంగు పోయిందనో, చాలా రోజుల నుంచి వాడుతున్నామనో పాత లెగ్గింగ్స్‌ను పారేస్తుంటాం. కాస్తంత సమయం కేటాయిస్తే వాటిని తిరిగి వినియోగించుకునేలా సిద్ధం చేసుకోవచ్చు. అదెలాగంటే...

రెండు మూడు పాత లెగ్గింగులను తీసుకుని వాటిని పొడవుగా కత్తిరించి కిటికీలు, గుమ్మాలకు కట్టే ఆకర్షణీయమైన డోర్‌కర్టెన్లను తయారు చేసుకోవచ్చు. మెషిన్‌ సాయంతో కత్తిరించిన భాగాలన్నింటిని ఒక్కొక్కటిగా జోడిస్తే సరి. రంగురంగుల కర్టెన్లు తయారైపోతాయి.

వీటిని షాట్స్‌లా కట్‌ చేసుకుని లోదుస్తులుగానూ వాడొచ్చు. అడుగు భాగంలో పోగులు వచ్చేయకుండా ఒక కుట్టు వేస్తే సరి.

పాత లెగ్గింగ్స్‌ను తీసుకుని ఒక కాలి భాగాన్ని చేతికి వేసుకుని బొటనవేలు వచ్చిన దగ్గర మార్క్‌ చేసుకోవాలి. అక్కడ వేలు పట్టేంత గుండ్రంగా కట్‌ చేయాలి. తర్వాత చేతిపై భాగంలో అరవంకీ వచ్చే దగ్గర గీత పెట్టి, కట్‌ చేయాలి. అంతే స్కూటీ నడిపేటప్పుడు హ్యండ్‌ గ్లవుజులుగా వీటిని వాడుకోవచ్చు.

లెగ్గింగ్‌ను మధ్యకి మడత పెట్టాలి. కిస్తా భాగంలో ఒక 2 ఇంచులు ఉండేట్టు మార్క్‌ చేసుకోవాలి. గుండ్రంగా ఉండేట్టు సున్నా గీయండి. మడతలు లేకుండా పేర్చి కట్‌ చేయండి. పోగులు రాకుండా ఒక లేస్‌ తీసుకుని చుట్టూ కుడితే బోట్‌ నెక్‌ బ్లవుజు తయారవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని