ఇంట్లోనే లిప్‌ బామ్‌

కప్పు గులాబీ రేకులను మిక్సీలో ముద్దగా చేసి, టేబుల్‌స్పూన్‌ చొప్పున షియా బటర్‌, బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంలో పావు చెంచా బీవ్యాక్స్‌ వేసి చిన్నమంటపై ఉంచి కలుపుతూ వేడిచేయాలి. చిక్కగా పేస్టులా అయిన తర్వాత ఈ లిప్‌బామ్‌ను చల్లార్చి పొడిసీసాలో నింపి పదిరోజుల వరకు ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు.

Updated : 14 Aug 2023 13:41 IST

ప్పు గులాబీ రేకులను మిక్సీలో ముద్దగా చేసి, టేబుల్‌స్పూన్‌ చొప్పున షియా బటర్‌, బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమంలో పావు చెంచా బీవ్యాక్స్‌ వేసి చిన్నమంటపై ఉంచి కలుపుతూ వేడిచేయాలి. చిక్కగా పేస్టులా అయిన తర్వాత ఈ లిప్‌బామ్‌ను చల్లార్చి పొడిసీసాలో నింపి పదిరోజుల వరకు ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు పెదాలకు ఇది రాస్తే, మృదుత్వం సంతరించుకుంటాయి.

బీట్‌రూట్‌తో.. మూడు టేబుల్‌స్పూన్ల బీట్‌రూట్‌ రసాన్ని చిక్కగా అయ్యేవరకూ వేడిచేయాలి. దీన్ని చల్లార్చిన తర్వాత టేబుల్‌స్పూన్‌ చొప్పున కొబ్బరినూనె, కలబంద గుజ్జు కలిపి ఆ మిశ్రమాన్ని సీసాలోకి మార్చి ఫ్రిజ్‌లో ఉంచాలి. వారం రోజులపాటు పెదాలకు అప్లై చేస్తే సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే బీట్‌రూట్‌ పౌడర్‌తోనూ లిప్‌బామ్‌ చేసుకోవచ్చు. చెంచా ఆముదం, షియాబటర్‌, రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనె, చెంచా బీస్‌వ్యాక్స్‌ తీసుకొని కలిపి చిన్నమంటపై చిక్కగా అయ్యేంతవరకు వేడిచేసి దించే ముందు చెంచా బీట్‌రూట్‌ పొడిని వేయాలి. బాగా కలిపిన ఈ మిశ్రమం రెండు వారాలపాటు నిల్వ ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని