కురులకు తమలపాకు!

ఈ మాసం ఇంట్లో ఎక్కువ కనిపించే వాటిల్లో తమలపాకులూ ఒకటి కదూ! జీర్ణశక్తిని పెంచే ఇవి కురుల ఆరోగ్యానికీ తోడ్పడతాయని తెలుసా?

Published : 18 Aug 2023 00:03 IST

ఈ మాసం ఇంట్లో ఎక్కువ కనిపించే వాటిల్లో తమలపాకులూ ఒకటి కదూ! జీర్ణశక్తిని పెంచే ఇవి కురుల ఆరోగ్యానికీ తోడ్పడతాయని తెలుసా?

ఐదు తమలపాకులను పేస్టు చేసుకొని దానికి రెండు స్పూన్ల కొబ్బరినూనె, స్పూను ఆముదం కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి కుదుళ్ల వరకు పట్టించి, అరగంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

 పది తమలపాకుల పేస్టుకి మూడు చెంచాల నెయ్యి, చెంచాన్నర తేనె వేసి బాగా కలపాలి. మాడుకి ప్యాక్‌లా వేసుకొంటే సరి. ఇది జుట్టు రాలడాన్నే కాదు చివర్లు చిట్లడాన్నీ అదుపు చేస్తుంది.

 మూడు మందార పూలు, అయిదు తమలపాకులు, గుప్పెడు కరివేపాకు, తులసి ఆకులను మెత్తగా మిక్సీ పట్టాలి. రెండు చెంచాల కొబ్బరినూనె కలిపి తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్‌ వేస్తే జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుంది. తమలపాకులోని విటమిన్‌ ఏ, బీ1, బీ2, సీ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కురులను దృఢంగా చేస్తూనే చుండ్రునూ నియంత్రిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని