చిక్కులు తప్పాలంటే..

ఓరోజు చలి.. మరో రోజు వేసవిని తలపించే వేడి.. ఈ మార్పులు మనపైనే కాదు కురులపైనా ప్రభావం చూపుతాయి. ఫలితమే గడ్డిలా మారి, వెంట్రుకలు జీవం కోల్పోవడం, అస్తమానం చిక్కులు వగైరా.

Published : 24 Aug 2023 01:59 IST

ఓరోజు చలి.. మరో రోజు వేసవిని తలపించే వేడి.. ఈ మార్పులు మనపైనే కాదు కురులపైనా ప్రభావం చూపుతాయి. ఫలితమే గడ్డిలా మారి, వెంట్రుకలు జీవం కోల్పోవడం, అస్తమానం చిక్కులు వగైరా. మరి ఈ ఇబ్బందులన్నీ తొలగాలంటే ఈ ప్యాక్‌లు ప్రయత్నించండి.

పెరుగు- ఆముదం: అరకప్పు పెరుగుకు మూడు టేబుల్‌ స్పూన్ల ఆముదం కలిపి మాడు నుంచి కురుల చివర్ల వరకు పట్టించండి. అరగంటయ్యాక గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. క్రమంగా మాడు పొడిబారడం, చుండ్రు అదుపులోకి వస్తాయి. శిరోజాలకు కావాల్సిన తేమ అంది మెరుస్తాయి.

తెల్లసొన: పట్టుకుచ్చు లాంటి జుట్టు ప్రతి అమ్మాయి కోరికే! కానీ, ఈ వాతావరణానికేమో అది గడ్డిలా మారుతుంది. గుడ్డు తెల్లసొనకు రెండు క్యాప్సూల్స్‌ విటమిన్‌ ఇ నూనెను కలిపి తలకు రాసి.. షవర్‌ క్యాప్‌ పెట్టి అరగంట వదిలేయండి. ఆపై రసాయనాల్లేని షాంపూతో తలస్నానం చేస్తే కురులకు కావాల్సిన పోషణ అంది పట్టుకుచ్చులా మెరుస్తాయి.

కలబంద: మాడు నుంచి చివర్ల వరకూ జుట్టుకి కలబంద గుజ్జును పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫెక్షన్లను దరిచేరనీయవు. పోషకాలు జుట్టును మెరిసేలా చేస్తూనే చిక్కుల్నీ పడనీయవు.

నిమ్మతో: గుడ్డు తెలసొనకి స్పూను ఆముదం, అరచెక్క నిమ్మరసం, స్పూను గ్లిజరిన్‌ కలిపి తలకు పట్టించండి. ఓ గంటయ్యాక షాంపూతో తలస్నానం చేస్తే చాలు.. చిక్కుల్లేని పట్టులాంటి కురులు మీ సొంతం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని