బ్లాక్‌హెడ్స్ పోవాలంటే....
ఆఫీసుకో, మార్కెట్‌కో వెళ్లినప్పుడు బయట కాలుష్యం కారణంగా ముఖంపై దుమ్మూ ధూళి పేరుకుపోతాయి. దాని వల్ల మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఏర్పడుతుంటాయి. వాటిని ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించొచ్చో చూద్దామా! బయటకు వెళ్లి వచ్చాక, సెనగపిండిలో చెంచా పంచదార కలిపి ముఖానికి రుద్దండి.
ఆఫీసుకో, మార్కెట్‌కో వెళ్లినప్పుడు బయట కాలుష్యం కారణంగా ముఖంపై దుమ్మూ ధూళి పేరుకుపోతాయి. దాని వల్ల మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఏర్పడుతుంటాయి. వాటిని ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించొచ్చో చూద్దామా!
- బయటకు వెళ్లి వచ్చాక, సెనగపిండిలో చెంచా పంచదార కలిపి ముఖానికి రుద్దండి. ఇది మురికిని తొలగించి చర్మ ఛాయను పెంచుతుంది.
- సమాన పరిమాణంలో పాలు, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనివ్వండి. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, పాలల్లోని విటమిన్లు చర్మానికి సాంత్వన అందిస్తాయి. బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.
- గుడ్డులోని తెల్లసొనలో రెండు చెంచాల నిమ్మరసం, తేనె కలిపి బాగా గిలకొట్టాలి. దీన్ని ముఖానికి రాసి ఆరాక బాగా రుద్ది కడిగేస్తే సరి. మొటిమలు, ట్యాన్, బ్లాక్ హెడ్స్ వంటివి తగ్గుతాయి. చర్మం బిగుతుగానూ మారుతుంది.
- చెంచా ఆలివ్ నూనెలో అరచెంచా చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. ఆపై వేళ్లను తడుపుకొంటూ స్క్రబ్ చేస్తే మురికితో పాటు బ్లాక్ హెడ్స్ కూడా తొలగిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.