నాజూకుదనానికి నడక

నడక శరీరం మొత్తానికి వ్యాయామం అందిస్తుంది. కానీ ఇల్లూ, ఆఫీసు బాధ్యతలతో ఖాళీ లేదనుకునేవారు... వాకింగ్‌తోనే ఆ లాభాలన్నీ పొందొచ్చు. అయితే ఇది చేయడానికీ కొన్ని పద్ధతులున్నాయి అంటారు నిపుణులు. 

Published : 03 Sep 2023 01:37 IST

నడక శరీరం మొత్తానికి వ్యాయామం అందిస్తుంది. కానీ ఇల్లూ, ఆఫీసు బాధ్యతలతో ఖాళీ లేదనుకునేవారు... వాకింగ్‌తోనే ఆ లాభాలన్నీ పొందొచ్చు. అయితే ఇది చేయడానికీ కొన్ని పద్ధతులున్నాయి అంటారు నిపుణులు..

  • ఓ అరగంట సమయాన్ని నడకకోసం కేటాయించుకోండి. ప్రారంభంలో కాస్త నెమ్మదిగా అడుగులేసినా ఏం కాదు... తర్వాత మాత్రం శరీరం మొత్తం కదిలేలా బ్రిస్క్‌ వాక్‌ చేయండి. ఇది వేగంగా బరువుని తగ్గిస్తుంది.
  • నడకకి అలవాటు పడ్డాక మైదాన ప్రాంతాలకు బదులుగా... ఎత్తుపల్లాలతో ఉండే కొండలు, గుట్టల దారిని ఎంచుకోండి. ఇది మీ శ్వాస రేటుని పెంచుతుంది. అయితే, ఎక్కడైనా సరే, తలెత్తుకునే నడవాలి. అంటే చెవులు భుజాలకు, గడ్డం భూమికి సమాంతరంగా ఉండేలా చూసుకోండి. అలానే నడుమును నిటారుగా ఉంచండి. లేదంటే కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది.
  • నడవడం వల్ల మీ బరువు తగ్గడమే కాక కాళ్లు, చేతులు, కీళ్ల కండరాలు బలంగా మారతాయి. ఎముకలు గట్టిపడతాయి. వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అసలు ఆరుబయటకెళ్లే సమయం లేదనుకుంటే ఉన్నచోటే నిలబడి నడవండి. ఇది కూడా ఇప్పుడు ట్రెండే.
  • నడిచేటప్పుడు చేతుల్ని మీ అడుగుల వేగానికి తగ్గట్లు కదిలించండి. ఈ సమయంలో పొట్ట కండరాలను వెనక్కు లాగి వదులుతూ ఉంటే శరీరం సౌకర్యంగా ఉంటుంది. అయితే నడిచేటప్పుడు ఫోన్లు చూసుకోవడం, నేలను చూడటం వల్ల మెడపై అనవసర ఒత్తిడి పడుతుంది. అలానే బూట్లను సరైనవి ఎంచుకోండి. వేగంగా నడవాలనే ఆలోచనతో పెద్ద పెద్ద అడుగులు వేయడం వల్ల కీళ్లపై భారం పడుతుందని గుర్తుంచుకోండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని