మొటిమల కోసం... బ్యూటీ ప్యాచ్‌లు!
మన అందమైన ముఖానికి శత్రువెవరంటే కచ్చితంగా మొటిమే అని చెబుతాం కదూ! ఒక్కసారి వచ్చిందంటే కొన్నిరోజుల వరకూ పోదు.
మన అందమైన ముఖానికి శత్రువెవరంటే కచ్చితంగా మొటిమే అని చెబుతాం కదూ! ఒక్కసారి వచ్చిందంటే కొన్నిరోజుల వరకూ పోదు. అంతేనా ఉన్నంతకాలం నొప్పి. తగ్గాకేమో మచ్చ. వేడుకల సమయాల్లో మేకప్‌తో అప్పటికి దాచినా తర్వాత సమస్య తీవ్రం అవుతుంది. వీటితో మామూలు తిప్పలా? అందుకే క్రీములు, ఇంటి చిట్కాలంటూ బోలెడు ప్రయత్నిస్తాం. ఈ తలనొప్పులకు చెక్ పెట్టేలా సిద్ధం చేసినవే ‘పింపుల్ ప్యాచ్’లు. చిన్న స్టిక్కర్ల మాదిరిగా ఉండే ఇవి హైడ్రోకొల్లాయిడ్‌తో తయారవుతాయి. ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక వీటిని సమస్య ఉన్న ప్రాంతంలో అతికించుకుంటే సరి. 6-8 గంటలు ఉంచుకుంటే మొటిమ పరిమాణాన్ని తగ్గించడమే కాదు.. నయమయ్యేలానూ చూస్తాయి. సమస్య తీరుతోంది సరే.. అవీ ముఖంపై అందాన్ని తగిస్తున్నాయని భావిస్తోందీ తరం. అందుకే ఇలా వాటినీ హృదయం, హరివిల్లు, పువ్వులు.. వంటి భిన్నరకాల్లో తీసుకొచ్చారు. ఫ్యాషన్‌గా కనిపిస్తూనే సమస్యకూ చెక్ పెట్టేసే ఇవి మీ మనసూ దోచాయా మరి?
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.