కురులకు కలబంద..
వాతావరణ కాలుష్యం, షాంపూల్లోని రసాయనాలు.. ఇలా కురులపై ప్రతికూల ప్రభావం చూపే అంశాలెన్నో. కలబంద ప్రయత్నించి చూడండి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఎ, సి, ఇ, బి12 విటమిన్లతోపాటు మరెన్నో పోషకాలు మీ సమస్యలకు చెక్ పెట్టేస్తాయి.
వాతావరణ కాలుష్యం, షాంపూల్లోని రసాయనాలు.. ఇలా కురులపై ప్రతికూల ప్రభావం చూపే అంశాలెన్నో. కలబంద ప్రయత్నించి చూడండి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఎ, సి, ఇ, బి12 విటమిన్లతోపాటు మరెన్నో పోషకాలు మీ సమస్యలకు చెక్ పెట్టేస్తాయి.
పెరుగుతో కలిపి... కప్పు కలబంద గుజ్జులో కాస్త పెరుగు కలిపి తలకు పట్టించాలి. అరగంటాగి తలస్నానం చేస్తే జుట్టు మెరవడమే కాదు చుండ్రు నుంచీ విముక్తి లభిస్తుంది.
కొబ్బరి నూనెతో... పావు కప్పు కొబ్బరి నూనెకు రెండు స్పూన్ల అలోవెరా గుజ్జు కలిపి కొద్దిగా వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే పాయలుగా విడదీస్తూ దూది సాయంతో తలంతా అద్దాలి. అయిదు నిమిషాల పాటు మృదువుగా మర్దనా చేయాలి. అరగంటయ్యాక గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇది జుట్టును మృదువుగా చేయడమే కాదు కండిషనర్‌లా కూడా పని చేస్తుంది.
నిమ్మకాయతో.. చెమట, మాడుపై చేరిన దుమ్ము.. ఇలా చుండ్రుకు కారణాలెన్నో. అరకప్పు కలబంద గుజ్జుకు అరచెక్క నిమ్మకాయ రసం కలపండి. ఆ మిశ్రమాన్ని తల నుంచి కురుల చివర్ల వరకూ పట్టించాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు. విటమిన్ సి చుండ్రుకు సహజ నివారిణిగా పనిచేస్తుంది. ఇతర పోషకాలు శిరోజాలు ఒత్తుగా పెరగడంలో సాయపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.