అవి లేకపోతేనేం!
అలంకరణ కిట్ అంతా ఉంటే కానీ మేకప్ వేసుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం కాదని అనుకుంటాం. కానీ, అవి అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఇవి ఉపయోగపడతాయి... అలంకరణ తొలగించుకోవడానికి క్లెన్సర్ అందుబాటులో లేనప్పుడు కాసిని పాలతోనూ ముఖాన్ని శుభ్రపరుచుకోవచ్చు.
అలంకరణ కిట్ అంతా ఉంటే కానీ మేకప్ వేసుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం కాదని అనుకుంటాం. కానీ, అవి అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఇవి ఉపయోగపడతాయి...
- అలంకరణ తొలగించుకోవడానికి క్లెన్సర్ అందుబాటులో లేనప్పుడు కాసిని పాలతోనూ ముఖాన్ని శుభ్రపరుచుకోవచ్చు.
- ఐలైనర్‌కి ప్రత్యామ్నాయంగా మస్కారాని వాడుకోవచ్చు. సన్నని బ్రష్‌ని మస్కారా బాటిల్‌లో ముంచి లైనర్‌గా వాడుకోవచ్చు.
- ఫౌండేషన్ లేనప్పుడు కన్సీలర్‌ను ఉపయోగించండి. హైలైటర్ అయిపోయిందా ఏం కంగారక్కర్లేదు ఐషాడోతో గీసేయండి.
- బ్లష్‌కి బదులుగా లిప్‌స్టిక్‌ని వాడొచ్చు. గులాబీ రంగుని ఎంచుకుని అక్కడక్కడా చుక్కల్లా పెట్టి కుచ్చుతో రాస్తే సరి. చెక్కిళ్లు భలే అందంగా మెరిసిపోతాయి.
- పెర్‌ఫ్యూమ్ పరిమళం ఎక్కువ సేపు నిలిచి ఉండాలంటే ఆ ప్రాంతంలో కాస్త వ్యాజలీన్ రాసి చల్లితే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.