కాకర రసం.. చుండ్రు దూరం!
చేదుగా ఉంటుందన్న మాటేకానీ కాకరకాయ ఎంత ఆరోగ్యభరితమో మనందరికీ తెలుసు. దీనిలో పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండి, కురుల సంరక్షణకూ సాయపడుతుంది..
Updated : 21 Nov 2023 03:29 IST
చేదుగా ఉంటుందన్న మాటేకానీ కాకరకాయ ఎంత ఆరోగ్యభరితమో మనందరికీ తెలుసు. దీనిలో పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండి, కురుల సంరక్షణకూ సాయపడుతుంది..
- చుండ్రు పెరగడానికి కాలుష్యం కూడా ఒక కారణమే. దీని నివారణకు పావుకప్పు కాకరరసంలో, రెండు చెంచాల నిమ్మరసం, కాస్త జీలకర్ర పొడి కలిపి మాడుకి బాగా పట్టించాలి. పావుగంటాగి, గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
- పొడిబారిన జుట్టుకి తేమనందించడంలో కాకర ముందుంటుంది. ఇందుకు పావుకప్పు పెరుగులో రెండు చెంచాల కాకరరసం, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని మాడు నుంచి చివర్ల వరకు పట్టించాలి. సమయం ఉంటే వేళ్లతో మాడుపై మర్దనా చేస్తే మరీ మంచిది. అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కురులకు తేమ అంది పట్టులా మెరుస్తాయి.
- పావుకప్పు కాకరరసానికి కొద్దిగా కొబ్బరినూనె కలిపి జుట్టు మెత్తానికి పట్టించి.. ఐదు నిమిషాలు మృదువుగా మర్దనా చేయాలి. అరగంటాగి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జట్టురాలే సమస్య తగ్గుతుంది.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.