పఫ్‌ టాప్‌లో... పూలగుత్తిలా!

అమ్మాయిల అందాన్ని వికసించిన పూలతో పోల్చడం సహజమే కదూ. అలాంటి సోయగాన్ని అందమైన బొకేలో అమరిస్తే ఎలా ఉంటుంది అని డిజైనర్లకి ఆలోచన వచ్చిందేమో! అందుకే ఈ పఫ్‌ టాప్‌లను తీసుకొచ్చినట్టున్నారు. ప్లెయిన్‌ నెక్‌ స్టైల్‌... చేతుల దగ్గర లేయర్డ్‌ పఫ్‌హ్యాండ్స్, కిందకొచ్చేసరికి సన్నగా బెల్ట్‌ను చుట్టుకొని కుచ్చులుగా కనిపిస్తూ... ఈ టాప్‌లు అలాగే తోస్తాయి మరి. ‘మినిమమ్‌ వేస్టేజ్‌’ దీని ప్రత్యేకత. వస్త్రం మొత్తాన్నీ దీనిలో వాడేస్తారు.

Published : 31 May 2024 02:26 IST

అమ్మాయిల అందాన్ని వికసించిన పూలతో పోల్చడం సహజమే కదూ. అలాంటి సోయగాన్ని అందమైన బొకేలో అమరిస్తే ఎలా ఉంటుంది అని డిజైనర్లకి ఆలోచన వచ్చిందేమో! అందుకే ఈ పఫ్‌ టాప్‌లను తీసుకొచ్చినట్టున్నారు. ప్లెయిన్‌ నెక్‌ స్టైల్‌... చేతుల దగ్గర లేయర్డ్‌ పఫ్‌హ్యాండ్స్, కిందకొచ్చేసరికి సన్నగా బెల్ట్‌ను చుట్టుకొని కుచ్చులుగా కనిపిస్తూ... ఈ టాప్‌లు అలాగే తోస్తాయి మరి. ‘మినిమమ్‌ వేస్టేజ్‌’ దీని ప్రత్యేకత. వస్త్రం మొత్తాన్నీ దీనిలో వాడేస్తారు. కటింగ్‌ పాళ్లు చాలా తక్కువ. ఎక్కువగా కనిపించేది ఆర్గంజానే అయినా సిల్క్, కాటన్, నెట్‌ వస్త్రరకాల్లోనూ దొరుకుతున్నాయి. బెల్‌బాటమ్, పెన్సిల్‌ ప్యాంట్, లెహెంగా, స్కర్ట్‌ ఏదైనా సరే.. పఫ్‌టాప్‌ మీదకి చక్కగా సెట్టయిపోతోంది. బాటమ్‌ వేర్‌ హెవీ డిజైన్లతో ఉంటే ఇది కాంట్రాస్ట్‌గా ప్లెయిన్‌ లుక్‌తో వస్తుంది. అదే కాస్త గ్రాండ్‌గా కావాలనుకుంటే సీక్వెన్లు, పూలు, బీడ్స్‌ వర్క్‌తో ఉన్న పఫ్‌ టాప్‌లను ఎంచుకుంటే సరిపోతుంది. హోరెత్తించే పార్టీలే కాదు... సంప్రదాయ వేడుకలకూ తగ్గ డిజైన్లున్నాయి. ఏ వేడుకకి ఎంచుకోవాలన్నదిక మీవంతు. పఫ్‌ టాప్‌తో పూలగుత్తిలా మెరవడానికి సిద్ధమా మరి? 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్