జుట్టు లేకపోయినా ముడి వేయొచ్చు

జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందన్నది సామెత! కానీ, ఇప్పుడు కురులున్నా లేకున్నా... కూడా ఈ స్క్రంచీ బన్స్‌తో ముడి పెట్టేయొచ్చు.

Updated : 01 Jun 2024 10:02 IST

కొత్త ట్రెండ్‌

జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందన్నది సామెత! కానీ, ఇప్పుడు కురులున్నా లేకున్నా... కూడా ఈ స్క్రంచీ బన్స్‌తో ముడి పెట్టేయొచ్చు. అలాగని ఇవి అమ్మమ్మలు పెట్టుకునే వేలు ముడి ఏమో అని తీసిపారేయకండి. ఈ స్క్రంచీ బన్‌... పెట్టుకున్నవారికి స్టైలిష్‌ లుక్‌ని తెచ్చిపెడుతుంది. స్క్రంచీ అనేది జుట్టుని ముడివేసే క్లాత్‌ రబ్బర్‌ బ్యాండ్‌. ఇది పోనీటైల్‌ చుట్టూ రఫుల్‌ డిజైన్‌లా కనిపిస్తుంది. ఆ డిజైన్‌ ఆధారంగానే అచ్చంగా జుట్టుతోనే రకరకాల డిజైన్లలో బన్‌లను తయారు చేస్తున్నారు. వీటిని పోనీటెయిల్, జడ, ముడి... దేనిమీదకైనా ఎంచుకోవచ్చు. ఎలాస్టిక్‌ బ్యాండ్‌ సాయంతో తయారైన ఈ బన్‌లను సులువుగా జడకి లేదా కొప్పుకి చుట్టేసుకోవచ్చు. కొన్ని క్లచ్, క్లిప్‌ల సాయంతోనూ తయారవుతున్నాయి. కాబట్టి మన సౌకర్యానికి తగ్గట్లు ఎంచుకోవచ్చు. తారలు వేసుకునే హాఫ్‌ బన్‌ హెయిర్‌ స్టైల్, లేదా సౌకర్యంగా ఉండే సింపుల్‌ నాట్, అదీ కాదంటే వెడ్డింగ్‌ లుక్‌...ఇలా సందర్భానికి తగ్గట్లు మనకు నచ్చిన బన్‌ని ప్రయత్నించొచ్చు. ఫ్యాషన్‌కోసం పూర్తి భిన్నమైనవీ ఎంపిక చేసుకోవచ్చు. ఇంకాస్త ఆధునికతను కోరుకునేవారికోసం కలర్‌ స్ట్రీకింగ్‌ చేసినవీ, రకరకాల ఛాయల్లో డై చేసినవీ దొరుకుతున్నాయి. ఉంగరాల జుట్టు, సాఫ్ట్‌ హెయిర్‌... నప్పుతుందో లేదో అన్న బెంగా అక్కర్లేదు. మీ శిరోజాల తత్వానికి దగ్గరగా ఉండే రకాల్నీ ఎంచుకోవచ్చు. పార్టీ అయినా, ఫంక్షన్‌ అయినా... నచ్చిన కొప్పు పెట్టుకుని మెప్పించడమే తరవాయి. మరి వీటినోసారి చూసేయండిక!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్