పుచ్చకాయ పర్సు.. కథేంటంటే..

కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ అనగానే... అందమైన తారలు, వారు ధరించే డిజైనర్‌ వస్త్రాలే గుర్తుకొస్తాయి. కానీ కొందరు మాత్రం ఫ్యాషన్‌కి సందేశాన్నీ జోడిస్తుంటారు. అదే చేశారు... కనీ కస్రుతి. ఈసారి మన భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ కేన్స్‌ వేదికపై స్టాండింగ్‌ ఒవేషన్‌తోపాటు అవార్డునీ అందుకుంది.

Published : 03 Jun 2024 00:48 IST

కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌ అనగానే... అందమైన తారలు, వారు ధరించే డిజైనర్‌ వస్త్రాలే గుర్తుకొస్తాయి. కానీ కొందరు మాత్రం ఫ్యాషన్‌కి సందేశాన్నీ జోడిస్తుంటారు. అదే చేశారు... కనీ కస్రుతి. ఈసారి మన భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ కేన్స్‌ వేదికపై స్టాండింగ్‌ ఒవేషన్‌తోపాటు అవార్డునీ అందుకుంది. ఈ సినిమా ప్రధాన పాత్రధారుల్లో ఒకరీమె. రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ గాజా యుద్ధ బాధితులకు భారత్‌ తరఫున సంఘీభావం తెలిపారు. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం తన వాటర్‌మెలన్‌ బ్యాగ్‌. దీంతో సంఘీభావం ఎలా అంటారా? దీనిలోని ఎరుపు గుజ్జు, నల్లని విత్తనాలు, తెలుపు, బయటివైపు కనిపించే పచ్చని రంగు... ప్రతిదీ పాలస్తీనా జెండాలో ఉంటాయి. అందుకే వాళ్లకి మద్దతుగా పుచ్చకాయ ముక్క ఆకృతిలో ఈ బ్యాగుని రూపొందించుకున్నారు కనీ . 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్