జెల్‌ మాస్క్‌... వేద్దామా?

ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఆరోగ్యానికి మేలని అవిసెలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకునేవారు ఎక్కువే. అయితే ఇవి అందానికీ చేసే మేలెంతో. రెండు కప్పుల నీటికి పావుకప్పు అవిసెలను చేర్చి మరిగించండి. జెల్‌లా అయ్యాక దింపేసి చల్లారనివ్వాలి.

Published : 03 Jun 2024 00:52 IST

అలసిపోయిన ముఖం తిరిగి జీవం పుంజుకోవాలంటే తగిన పోషణ అందించాల్సిందే! అది చిటికెలో పూర్తవుతుందని ‘మాస్క్‌’ను ఆశ్రయిస్తుంటాం కూడా. ఆ ఖర్చు తగ్గిస్తూ ఇంట్లోనే కొన్నింటిని ప్రయత్నించొచ్చని తెలుసా? అవేంటంటే...

మెగా 3 ఫ్యాటీయాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఆరోగ్యానికి మేలని అవిసెలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకునేవారు ఎక్కువే. అయితే ఇవి అందానికీ చేసే మేలెంతో. రెండు కప్పుల నీటికి పావుకప్పు అవిసెలను చేర్చి మరిగించండి. జెల్‌లా అయ్యాక దింపేసి చల్లారనివ్వాలి. జెల్‌ని వడకట్టి, ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలయ్యాక చల్లని నీటితో కడిగేస్తే సరి. ఇది చర్మానికి తేమను అందించడమే కాదు, ముడతలు, గీతలనూ దరిచేరనీయదు. కొల్లాజెన్‌ ఉత్పత్తినీ పెంచుతుంది. ఈ జెల్‌ని ఒకసారి చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెలరోజులు ఉంటుంది.

  • స్పూను కలబంద గుజ్జుకు రెండు టేబుల్‌ స్పూన్ల మిల్క్‌ క్రీమ్, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ మాస్క్‌ చర్మానికి పోషణనివ్వడంతోపాటు ఆరోగ్యంగా కనిపించేలానూ చేస్తుంది. అలర్జీలు, ఎరుపెక్కడం నుంచీ కాపాడుతుంది.
  • 30 దాటాయో లేదో చర్మం నిర్జీవంగా మారడం, చర్మరంధ్రాలు పెద్దవిగా కనిపించడం సహజమే కదూ! అవి తగ్గి, యవ్వనవంతమైన లుక్‌ కావాలంటే... గుడ్డు తెల్లసొనకు రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి, బాగా గిలకొట్టాలి. ఆపై ముఖానికి వేసి, పావుగంటయ్యాక కడిగేస్తే సరి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్