పెద్ద పోల్కీనే ప్రత్యేకం!

పోల్కీ నగలు... రాచరికపు హుందాతనానికీ, ఆడంబరానికీ అద్దం పట్టేలా ఉంటాయి. పోల్కీలంటే... పాలిష్‌ చేయకుండా, కత్తిరించకుండా సహజంగా ఉపయోగించే వజ్రాలే. వీటిని నేలపొరల నుంచి సేకరించి, శుభ్రపరిచి నేరుగా నగల్లో పొదుగుతారు. అందుకే ఇవి రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. సహజ మెరుపుతో ధగధగలాడే మొగలుల కాలం నాటి ఈ జ్యూయెలరీకి ఉత్తరాదిన బోలెడంత పాపులారిటీ.

Published : 04 Jun 2024 01:03 IST

పోల్కీ నగలు... రాచరికపు హుందాతనానికీ, ఆడంబరానికీ అద్దం పట్టేలా ఉంటాయి. పోల్కీలంటే... పాలిష్‌ చేయకుండా, కత్తిరించకుండా సహజంగా ఉపయోగించే వజ్రాలే. వీటిని నేలపొరల నుంచి సేకరించి, శుభ్రపరిచి నేరుగా నగల్లో పొదుగుతారు. అందుకే ఇవి రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. సహజ మెరుపుతో ధగధగలాడే మొగలుల కాలం నాటి ఈ జ్యూయెలరీకి ఉత్తరాదిన బోలెడంత పాపులారిటీ. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్‌ ప్రాంతాల్లో వీటిని ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ పోల్కీలు... కుందన్, మీనాకారీ, జాడౌ పనితనంతో నగల్లో ఒదిగిపోయి చూపరులను కట్టిపడేస్తుంటాయి. ముఖ్యంగా ధనికవర్గాలు, బాలీవుడ్‌ తారలు ఎక్కువగా ఇష్టపడే ఇవి ఇప్పుడు సామాన్యులకోసం కొత్తదనాన్ని చుట్టుకుని వచ్చేశాయి. ముఖ్యంగా సెమీప్రెషియస్‌ రకాల్లో అన్నివర్గాలనూ  ఆకట్టుకునేలా తయారుచేస్తున్నారు. అయితే, మొన్నమొన్నటివరకూ చిన్న చిన్న పోల్కీలు కుందన్‌ స్టైల్‌లో కనువిందు చేసిన హారాలు... ఇప్పుడు పెద్ద పెద్ద పోల్కీలతో జిగేల్‌మనిపిస్తున్నాయి. మరి వాటినోసారి మనమూ చూద్దామా! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్