కడలి అందాల కనికట్టు!

పాల వన్నెలతో మెరిసిపోతూ మురిపించే ముత్యాలంటే ఇష్టపడని మగువలుంటారా? అయితే, ఇప్పుడు వీటితో పాటు ఆల్చిప్పలు, సముద్ర గర్భంలో జీవించే మరికొన్ని రకాల మొలస్కన్ల లోపలి పొర మదర్‌ఆఫ్‌ పెరల్‌(నాక్రే)తోనూ యాక్సెసరీలు తయారు చేస్తున్నారు. వీటిల్లో పర్సులు, క్లచ్‌ల తీరే వేరు.

Published : 14 Jun 2024 01:21 IST

పాల వన్నెలతో మెరిసిపోతూ మురిపించే ముత్యాలంటే ఇష్టపడని మగువలుంటారా? అయితే, ఇప్పుడు వీటితో పాటు ఆల్చిప్పలు, సముద్ర గర్భంలో జీవించే మరికొన్ని రకాల మొలస్కన్ల లోపలి పొర మదర్‌ఆఫ్‌ పెరల్‌(నాక్రే)తోనూ యాక్సెసరీలు తయారు చేస్తున్నారు. వీటిల్లో పర్సులు, క్లచ్‌ల తీరే వేరు. సందర్భం ఏదైనా సొగసులీనేలా చేస్తాయి. కడలి సంపద అయిన ముత్యాలు, ఆల్చిప్పలు, శంఖం... ఇలా ఎన్నో ఆకృతుల్లో కనువిందు చేస్తున్నాయి. ఇందులో కొన్నింటికి పసిడి హంగులు, వెండి మెరుపులూ అద్ది డిజైన్‌ చేస్తుంటే, మరికొన్ని అచ్చంగా అసలు రూపంలోనే కనిపిస్తున్నాయి. పైగా ఇవి ఈ తరంవారి ఆధునిక ఆలోచనలకు తగ్గట్లే కాదు... అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటున్నాయి. అసలే ఫ్యాషన్‌ అంటే దుస్తులే కాదు... నప్పే యాక్సెసరీలూ అంటుంటారు నేటి యువతులు. పైగా ఇవి ఏ తరహా డ్రెస్సింగ్‌ స్టైల్‌కైనా ఇట్టే అమరిపోవడంతో మరింతగా ఇష్టపడుతున్నారు. మరి ఇంకెందుకాలస్యం వీటినోసారి చూసి మీరూ ఒకటి తెచ్చేసుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్