తమలపాకు... పండింది!

అమ్మాయి అరచేయి... ఎర్రగా పండి కనిపిస్తోంటే ఎంత అందమో కదా! వేడుకలప్పుడు చేతిపై ఆ అందం లేకపోతే బోసిపోయినట్లే అనిపిస్తుంది. కానీ అస్తమానూ గోరింటాకే కావాలంటే చాలామందికి కష్టమే. అయితే తమలపాకు తెచ్చేసుకోండి.

Published : 14 Jun 2024 01:24 IST

అమ్మాయి అరచేయి... ఎర్రగా పండి కనిపిస్తోంటే ఎంత అందమో కదా! వేడుకలప్పుడు చేతిపై ఆ అందం లేకపోతే బోసిపోయినట్లే అనిపిస్తుంది. కానీ అస్తమానూ గోరింటాకే కావాలంటే చాలామందికి కష్టమే. అయితే తమలపాకు తెచ్చేసుకోండి. దానితోనూ అరచేత ఎర్రదనం పండించుకోవచ్చు. ఎలాగంటే... తాజా తమలపాకులు ఓ పది తీసుకుని, కాడలు తీసేయండి. వాటికి అరస్పూను చొప్పున పసుపు, సున్నం కలిపి, మెత్తగా మిక్సీ పట్టండి. నీళ్లు కలపొద్దు, నిల్వ ఉన్న ఆకుల్నీ వాడొద్దు. తరవాత రసాన్ని వడకట్టి, బాగా ఎర్రగా ఉన్న కుంకుమ కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో చేతిపై నచ్చిన డిజైను వేసుకోండి. ఆరిన తరవాత కడిగేసి చూసుకోండి... అచ్చమైన గోరింటాకులాగే పండుతుంది. మొత్తం ప్రక్రియకు ఎక్కువ సమయం కూడా పట్టదు. కావాలంటే ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్