నైటీలో... బయటికీ వెళ్లొచ్చిక!

వంటింట్లో ఫలానా వస్తువు అయిపోయింది... అర్జెంటుగా కావాలి, కొద్దిగా తెచ్చిపెట్టండి. పిల్లలను కాస్త వ్యాను వరకూ ఎక్కించి రావొచ్చుగా... ఇలా ఏం అడిగినా కొన్నిసార్లు అవతలి నుంచి ‘నువ్వేం చేస్తున్నావ్‌? నువ్వే వెళ్లొచ్చుగా’ అనే సమాధానం వచ్చేస్తుంది.

Published : 15 Jun 2024 01:39 IST

వంటింట్లో ఫలానా వస్తువు అయిపోయింది... అర్జెంటుగా కావాలి, కొద్దిగా తెచ్చిపెట్టండి. పిల్లలను కాస్త వ్యాను వరకూ ఎక్కించి రావొచ్చుగా... ఇలా ఏం అడిగినా కొన్నిసార్లు అవతలి నుంచి ‘నువ్వేం చేస్తున్నావ్‌? నువ్వే వెళ్లొచ్చుగా’ అనే సమాధానం వచ్చేస్తుంది. ‘నేను నైటీలో ఉన్నా. దుస్తులు మార్చుకోవడానికి సమయం పడుతుంది’ అన్నామంటే చాలు.. ‘ఎప్పుడు చూడూ ఆ నైటీనే!’... ‘నైటీలో మడ్డిగా ఉండక... చక్కగా రెడీ అవ్వొచ్చుగా’... అనేస్తుంటారు. అనడానికేం సులువుగా మాట అనేస్తారు. ఉదయాన్నే లేచి అందంగా ముస్తాబవుతూ కూర్చుంటే పనులెలా సాగుతాయి? ఎంత చకచకా కదిలినా ఆఖరి నిమిషం వరకూ ఊపిరి సలపనంత పని. వేసుకోవడం సులువు... పనులు చేసుకోవడానికీ అనువుగా ఉంటుందని మనమేమో నైటీలు వేసుకుంటాం. వాటిని చూసి ఇదిగో రోజూ ఇలా ఏదో ఒక మాట అనిపించుకోవాలి. ఇంట్లో అనువేగానీ... కొన్నిసార్లు బయటికి వెళ్లాల్సొస్తే మనకీ కష్టమే. అకస్మాత్తుగా ఎవరైనా ఇంటికి వచ్చినా ఆ దుస్తుల్లో కాస్త ఇబ్బందిగానే తోస్తుంది. అందుకే అప్పటికప్పుడు హడావుడిగా దుస్తులు మార్చుకుంటాం. ఈ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ... అన్నిందాలా అనుకూలంగా ఉండే నైట్‌వేర్‌ ఉంటే ఎంత బాగుంటుందో కదా! అయితే ఈ ‘నైటీ కమ్‌ లాంగ్‌ ఫ్రాంక్‌’లను ఓసారి చూసేయండి. నైటీలేకానీ డిజైనర్‌ లాంగ్‌ ఫ్రాకుల్లా కనిపిస్తాయి. ఫంక్షన్లకైతే వెళ్లలేం కానీ... చక్కా అర్జెంటు పనులు చక్కబెట్టేసుకోవచ్చు. డ్రెస్‌ మార్చుకోవాలన్న బెడద ఉండదు, పని చేసుకోవడానికీ సౌకర్యం. భలేగున్నాయి కదూ! కాటన్, రేయాన్, సిల్క్‌... కాలానికి తగ్గట్టుగా క్లాత్‌ను ఎంచుకుంటే చాలు. సౌకర్యంగా గడిపేయొచ్చు. మీకూ నచ్చాయా? ఇంకేం... ఓ నాలుగు తెచ్చేసుకుంటే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్