గౌనుపై ప్రేమలేఖ.. చీరపై శిల్పకళ!

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి వేడుక ప్రత్యేకం. ఈ సమయంలో ధరించే దుస్తులు, ఇతర అలంకరణ అందరినీ ఆకట్టుకోవాలని కోరుకోవడమూ సహజం. సెలెబ్రిటీలైతే ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు.

Published : 19 Jun 2024 01:49 IST

ట్రెండింగ్‌

ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి వేడుక ప్రత్యేకం. ఈ సమయంలో ధరించే దుస్తులు, ఇతర అలంకరణ అందరినీ ఆకట్టుకోవాలని కోరుకోవడమూ సహజం. సెలెబ్రిటీలైతే ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. ప్రస్తుతం అలా ఇంటర్నెట్‌ ట్రెండింగ్‌లో నిలిచిన వారిలో అంబానీల ఇంట కోడలిగా అడుగుపెట్టనున్న రాధికా మర్చంట్‌ ఒకరు కాగా, మరొకరు ప్రముఖ నటుడు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా కుమార్తె నటి ఐశ్వర్య. ఇటలీలో జరుగుతున్న తన రెండో ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో ‘స్టారీ నైట్‌’ థీమ్‌ ప్రోగ్రామ్‌లో రాధికా మర్చంట్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో తళుక్కుమంది. ఈ ఆఫ్‌షోల్డర్‌ గౌన్‌ అలాంటి ఇలాంటిది కాదండోయ్‌! కాబోయే భర్త, ప్రేమికుడు అనంత్‌ తన 22వ పుట్టినరోజుకి రాసిన ప్రేమలేఖని తన దుస్తులపై ప్రింట్‌ వేయించుకుంది. రాధిక అభిరుచులకు అనుగుణంగా అంతర్జాతీయ ఫ్యాషన్‌ డిజైనర్‌ రాబర్ట్‌ వున్‌ దీన్ని రూపొందించారు. అంతేకాదు, ఇది ఓ మంచి జ్ఞాపకంగా తన తరవాత తరాలవారికీ అందిస్తానంటోంది రాధిక. ఇక, సంప్రదాయంగా జరిగిన పెళ్లివేడుకల్లో ఐశ్వర్య అర్జున్‌ ఎరుపు, పసిడి రంగు పట్టు చీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది. ఆమె కట్టిన చీరేంటా అని అమ్మాయిలంతా అంతర్జాలంలో తెగ వెతికేశారు. ఈ కాంజీవరం శారీని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ గౌరంగ్‌ షా రూపొందించారు. కంచి దేవాలయ గోడలపై ఉన్న శిల్పాలను గుర్తు తెచ్చేలా రామ పట్టాభిషేక ఘట్టాలను అంచుపై నేశారు. జతగా జర్దోసీ ఎంబ్రాయిడరీ బ్లవుజు, టెంపుల్‌ స్టైల్‌ నగలతో మెరిసిపోయింది పెళ్లికూతురు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్