ఆసనాలు వేసేలా... స్టైల్‌ తెలిపేలా!

యోగా... ఇది ఈనాటిదా? అయిదు వేల ఏళ్ల క్రితం నుంచే మనదేశ సంస్కృతిలో అంతర్భాగం. శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా ఉంచే సాధనమిది. అందుకే మోడరన్‌ అమ్మాయిలూ దీనివైపు మొగ్గు చూపుతున్నారు. దినచర్యలో వ్యాయామాన్ని అంతర్భాగం చేసుకోవాలనుకునే వారి ప్రధాన ఎంపికా యోగానే అవుతోంది.

Published : 21 Jun 2024 01:55 IST

యోగా... ఇది ఈనాటిదా? అయిదు వేల ఏళ్ల క్రితం నుంచే మనదేశ సంస్కృతిలో అంతర్భాగం. శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా ఉంచే సాధనమిది. అందుకే మోడరన్‌ అమ్మాయిలూ దీనివైపు మొగ్గు చూపుతున్నారు. దినచర్యలో వ్యాయామాన్ని అంతర్భాగం చేసుకోవాలనుకునే వారి ప్రధాన ఎంపికా యోగానే అవుతోంది. సంప్రదాయ వ్యాయామ పద్ధతి కదా అని ఏవో ఒక దుస్తుల్లో చేసేద్దామంటే ఊరుకుంటారా ఏంటీ ఈ తరం అమ్మాయిలు. సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూనే స్టైల్‌గానూ ఉండాలనుకుంటున్నారు. పైగా వాటిని వ్యాయామానికే పరిమితం చేయొద్దు... క్యాజువల్‌ వేర్‌గానూ ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఆధునిక వస్త్రాలూ సిద్ధమవుతున్నాయి. అంగారకా, ధోతి, హరెమ్, ఫ్లో, బోహో ప్యాంట్లకు షార్ట్, మిడ్‌ లెంత్‌ టాప్‌లు జత చేసుకొని అమ్మాయిల మనసు దోచేస్తున్నాయి. కోఆర్డ్‌ సెట్‌లను తలపించే జంప్‌సూట్‌లు, సైడ్‌ స్లిట్‌ డ్రెస్‌లు, లేయర్డ్‌ ప్యాంట్‌ సెట్ల సంగతిక చెప్పనక్కర్లేదు. చూపరులను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తాయంటే నమ్మండి. ఖాదీ, ఆర్గానిక్‌ కాటన్, రేయాన్, సిల్క్‌... వంటి భిన్న వస్త్రరకాల్లోనూ దొరుకుతున్నాయి. మీ స్టైల్‌కు తగ్గదేదో ఎంచుకోవడమే తరువాయి. ఆసనాలు వేయడానికి అనువుగా... మీ ప్రత్యేకతను తెలియజేసేలా ఉండే వస్త్రశ్రేణి వీటిల్లో ఏది మరి? 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్