బడికెళ్లేటప్పుడు క్లిప్పులు..!

బడులు తెరిచారు. బుజ్జాయిలు బడికెళ్లడం మొదలుపెట్టారు. స్కూల్‌ అంటే చక్కగా ఆడుకునే చోటు అనే భావన నుంచి తరవాతి తరగతిలోకి అడుగుపెట్టే చిన్నారుల కోసం ప్రత్యేకంగా మార్కెట్‌లోకి వచ్చాయి ఈ ‘బ్యాక్‌ టు స్కూల్‌ హెయిర్‌ క్లిప్స్‌’. అవేంటో చూద్దామా..!

Published : 23 Jun 2024 01:12 IST

బడులు తెరిచారు. బుజ్జాయిలు బడికెళ్లడం మొదలుపెట్టారు. స్కూల్‌ అంటే చక్కగా ఆడుకునే చోటు అనే భావన నుంచి తరవాతి తరగతిలోకి అడుగుపెట్టే చిన్నారుల కోసం ప్రత్యేకంగా మార్కెట్‌లోకి వచ్చాయి ఈ ‘బ్యాక్‌ టు స్కూల్‌ హెయిర్‌ క్లిప్స్‌’. అవేంటో చూద్దామా..!

అక్షరాలు, అంకెలతో...

బొమ్మలతో ఆడటంతోపాటు అక్షరాలు దిద్దే వయసులోకి అడుగుపెడుతున్నవారికి ఈ హెయిర్‌ క్లిప్పులు ప్రత్యేకం. అక్షరాల డిజైన్‌తో రంగురంగుల రిబ్బన్, మధ్యలో పలకా బలపం, దానిపై ఏబీసీలుండటంతో వీటిని అలంకరించుకోవడానికి చిన్నారులు ముచ్చటపడటం ఖాయం. క్లిప్పు మధ్యలో వారి మనసుకు నచ్చే కార్టూన్‌ బొమ్మ, చివరలో అలంకరణగా వారి పేరు, అలాగే క్లిప్‌ మధ్యలో పెన్సిళ్లు, స్కూల్‌ బస్సువంటి బొమ్మల డిజైన్లు చిన్నారుల మనసును దోచేస్తాయి.

బొమ్మలతో...

ఈ క్లిప్పులకు రిబ్బన్‌తో తయారుచేసిన అందమైన బొమ్మలు ఒద్దికగా అంటుకుని ఉంటాయి. రాకుమారి, ఫైటర్, నర్సు సహా కార్టూన్‌ బొమ్మలవంటి పలురకాల డిజైన్లతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కొన్నింటికైతే బార్బీడాల్స్‌లాంటి ముద్దుగా చిన్నచిన్న బొమ్మలు అటాచ్‌ చేసి ఉండటంతో చిన్నారులు తెగ ముచ్చటపడతారు. వాటిని అలంకరించుకుని మరీ స్కూల్‌కు బయలుదేరతారు. చూడటానికి భలేగున్న ఈ క్లిప్పులు మీ బుజ్జాయిలకూ కావాలి కదూ... 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్