లుక్‌ మార్చేద్దామా!

యువత అంటేనే సరదాలు, ఫ్యాషన్‌లు. తరచూ ఏదో ఒక పార్టీ ఉండనే ఉంటుంది. ఇలాంటప్పుడు అందరిలోనూ స్టైలిష్‌గా కనిపించాలని చేసే ప్రయత్నాలు ఒక్కోసారి సంతృప్తినవ్వవు. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడమంటున్నారు నిపుణులు.

Published : 23 Jun 2024 01:17 IST

యువత అంటేనే సరదాలు, ఫ్యాషన్‌లు. తరచూ ఏదో ఒక పార్టీ ఉండనే ఉంటుంది. ఇలాంటప్పుడు అందరిలోనూ స్టైలిష్‌గా కనిపించాలని చేసే ప్రయత్నాలు ఒక్కోసారి సంతృప్తినవ్వవు. ఇలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడమంటున్నారు నిపుణులు.

  • పార్టీలకు ఎప్పుడూ ఒకే తరహా డ్రెస్సింగ్‌ స్టైల్‌ కచ్చితంగా బోర్‌ కొట్టేస్తుంది. ఫ్యాషన్‌ ట్రెండ్స్‌లో కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని పసిగడితే చాలు.. మీరు అప్‌టూడేట్‌గా ఉన్నట్లే. రానున్నవన్నీ వానలే కాబట్టి కాస్త ముదురు రంగుల్ని, పూల డిజైన్లనీ ఎంచుకోండి. ఇవి పగటి పూటకైతే బాగుంటాయి.సంప్రదాయ కార్యక్రమాలకు పెప్లమ్‌ టాప్‌ లాంగ్‌ స్కర్ట్‌ చక్కటి ఎంపిక. రాత్రిళ్లు జరిగే వేడుకల్లో బ్లాక్‌ కోఆర్డ్‌ సెట్‌ ధరించి గోల్డ్‌ మెటాలిక్‌ బెల్ట్‌ పెట్టేస్తే చాలు. మీ లుక్‌ అదుర్స్‌. లేదంటే గోల్డ్, సిల్వర్‌ షైనింగ్‌ లాంగ్‌ గౌన్, దానికి జతగా లాంగ్‌ ఫ్లోరల్‌ ప్రింటెడ్‌ టాప్‌ కూడా వేసుకోవచ్చు.
  • చాలామంది దుస్తుల మీద పెట్టిన శ్రద్ధ చెప్పుల మీద పెట్టరు. మీరూ ఆ తరహానే అయితే మారాల్సిందే. వస్త్రధారణకు తగ్గట్టుగా చెప్పులను ఎంపిక చేసుకోవాలి. ప్యాంటు, షార్టులు వేసుకున్నప్పుడు బూట్లు, స్నీకర్స్‌ బాగుంటాయి. అలాగే డ్రెస్‌ల మీదకు హీల్స్‌ బాగా నప్పుతాయి. మీరు కట్టుకున్నవి సంప్రదాయ రకాలైతే జ్యూతీలకు మించినవి లేవు.
  • దుస్తులెంత ఆకర్షణీయంగా ఉన్నా.. కాస్తయినా మేకప్‌ చేసుకోకపోతే ఇబ్బందే. ఇప్పుడు గ్లాసీ, నేచురల్‌ మేకప్‌లే ట్రెండ్‌. వాటికోసం సింపుల్‌ ప్రొడక్ట్స్‌ వచ్చేశాయి. అలాంటివి ఎంచుకోండి. అలాగే... పెదాలకు లిప్‌స్టిక్, కళ్లకు కాజల్‌ మాత్రం మరచిపోకండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని