కొరియన్‌ సాక్స్‌ షూ... అదిరెన్‌!

అమ్మాయిల పాదాల్ని అంటిపెట్టుకునే పాదరక్షలు అందంగానే కాదు... సౌకర్యంగానూ ఉండాలంటోంది ఈ తరం. అందుకే, మొన్నటి వరకూ సందర్భానికో చెప్పుల రకాన్ని ఎంచుకుని సందడి చేశారు.

Published : 05 Jul 2024 02:06 IST

మ్మాయిల పాదాల్ని అంటిపెట్టుకునే పాదరక్షలు అందంగానే కాదు... సౌకర్యంగానూ ఉండాలంటోంది ఈ తరం. అందుకే, మొన్నటి వరకూ సందర్భానికో చెప్పుల రకాన్ని ఎంచుకుని సందడి చేశారు. ఆ తరవాత ఫ్లిఫ్‌ఫ్లాప్స్, స్నీకర్సే గొప్పంటూ తెగ తిరిగేశారు. ఇప్పుడు వీరంతా స్లిప్‌ ఆన్‌ షూస్‌కి జై కొడుతున్నారు. ఇందుకు కారణమూ ఉందండీ! కొరియన్‌ డ్రామాల్ని ఇష్టపడే మన అమ్మాయిలంతా... అందులోని నటీనటులు ఎక్కువగా ధరించే ఈ స్టైల్‌పై మనసుపడ్డారు మరి. అందుకే, వీరిని మెప్పించడానికి సాక్స్‌ మెటీరియల్‌తో కొరియన్‌ స్టైల్‌లో ఫుట్‌వేర్‌ని డిజైన్‌ చేస్తున్నారు తయారీదారులు. వీటిని బ్రీతబుల్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేయడం వల్ల పాదాల ఆరోగ్యమూ పదిలమే. నడిచేటప్పుడు హాయిగానూ, చూడ్డానికి ఫ్యాషనబుల్‌గానూ ఉండటం వల్ల వాకింగ్‌కీ, కాలేజీకీ, ఆఫీసుకీ కూడా వీటినే ఎంచుకుంటున్నారు. సందర్భంతో సంబంధం లేదంటూ... అన్ని సమయాలకూ ఈ సాక్స్‌ షూలనే వేసుకుంటున్నారు. ఓసారి ఇటు చూస్తే మీకూ నచ్చేయొచ్చు మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్