అదిరింది... ఆర్గాంజా ఫ్యాషన్‌!

పట్టు పరికిణీలో ఆడపడుచులు బుట్ట బొమ్మలా ఉన్నా... లెహంగాలు తెచ్చే అందమే వేరు. అందులోనూ రంగు రంగుల పూల డిజైన్లతో, తక్కువ బరువుతో ఉండే ఆర్గాంజా లెహంగాలు భలే లుక్‌ ఇస్తాయి.

Updated : 06 Jul 2024 14:42 IST

పట్టు పరికిణీలో ఆడపడుచులు బుట్ట బొమ్మలా ఉన్నా... లెహంగాలు తెచ్చే అందమే వేరు. అందులోనూ రంగు రంగుల పూల డిజైన్లతో, తక్కువ బరువుతో ఉండే ఆర్గాంజా లెహంగాలు భలే లుక్‌ ఇస్తాయి. అందుకే ఆతరం, ఈతరం అనే తేడా లేకుండా కాలేజీ అమ్మాయిల నుంచి నడివయసు వాళ్లవరకూ వీటిని వేసుకుని మురిసిపోతున్నారు. ఎంబ్రాయిడరీ, క్రిస్టల్, మిర్రర్, క్రష్‌డ్, శాటిన్‌... అంటూ రకరకాల లెహంగాలు అతివల మనసు దోచేస్తున్నాయిప్పుడు. అల్లంత దూరాన ఉన్నా కూడా... ఆకాశంలో తారల్లా మెరిసిపోతున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లూ, వేడుకలంటే బ్రైట్, బోల్డ్‌ రంగులే. కానీ, ప్రస్తుతం మ్యూటెడ్, పేస్టల్‌ షేడ్స్‌ ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ పూల ఆర్గాంజా లెహంగా ఒక్కటన్నా ఉండాల్సిందే అనుకుంటున్నారంతా. ఇక ఫ్యాషన్‌ ప్రియుల సంగతి చెప్పనక్కర్లేదు. వాళ్ల వార్డ్‌రోబ్‌లో అయితే, ఆర్గాంజా లెహంగా తప్పక ఉండాల్సిందే. అందుకే... హల్దీ, మెహందీ, సంగీత్‌లకు మోడ్రన్‌గా కనిపించాలనుకుంటే ఫ్లోరల్‌ డిజైన్‌లను ఎంచుకుంటున్నారు ముద్దుగుమ్మలు. ఏ రిసెప్షనో, స్నేహితురాలి పెళ్లికో అయితే, కొంచెం గ్రాండ్‌గా బ్లౌజ్‌కూ, స్కర్ట్‌ బోర్డర్‌కూ జరీ, సీక్విన్స్‌ ఎంబ్రాయిడరీ లాంటివి చేయించి... పెళ్లి కళ అంతా మాదే అనేస్తున్నారు. పైగా సందర్భమేదైనా ఫ్యాషనబుల్‌గా, హుందాగా ఉండడంతోపాటు సౌకర్యంగానూ ఉంటాయివి. వీటి మీదకు మరీ హెవీ జ్యుయెలరీ అవసరం కూడా ఉండదు. కాబట్టి, మెడలో ఓ చిన్న చోకర్‌ వేసుకుని, జుట్టు వదిలేస్తే చాలు. సింపుల్‌ లుక్‌లో మెరిసిపోతారంతే. పైగా వేసవి, వర్షాకాలాల్లో ఎలాంటి చిరాకు లేకుండా హాయిగా, తేలిగ్గా ఉండి గాల్లో తేలుతున్న ఫీలింగ్‌నీ కలిగిస్తాయి. మీరూ ప్రయత్నిస్తారా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్