అమ్మ నగలు... దుర్గమ్మ స్తోత్రాలు!

అపర కుబేరుడు అంబానీ ఇంటికి కాబోయే కోడలు...రాధిక మర్చంట్‌ ఫ్యాషన్‌ సెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భానికి తగ్గట్లు ఎంచుకోవడంలో తనకు తానే సాటి. తాజాగా జరిగిన పెళ్లి ఘట్టాల్లో గుజరాతీ సంప్రదాయమైన మామెరు వేడుక ఒకటి.

Updated : 08 Jul 2024 08:08 IST

అపర కుబేరుడు అంబానీ ఇంటికి కాబోయే కోడలు...రాధిక మర్చంట్‌ ఫ్యాషన్‌ సెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భానికి తగ్గట్లు ఎంచుకోవడంలో తనకు తానే సాటి. తాజాగా జరిగిన పెళ్లి ఘట్టాల్లో గుజరాతీ సంప్రదాయమైన మామెరు వేడుక ఒకటి. వధువు/వరుడు తల్లి తరఫున ఆమె పుట్టింటివారు పహోంచీ (బ్రేస్‌లెట్‌), ఘర్చోలా (పెళ్లిచీర) వంటి కానుకలు, స్వీట్లు తెస్తారు. ఈ కార్యక్రమంలో రాధిక... మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన రాణీ పింక్‌ లెహెంగాను ధరించి మెరిసిపోయింది. 35 మీటర్ల బాంధనీ వస్త్రంపై బనారసీ బ్రొకేడ్‌తో తీర్చిదిద్దారు. దీని బోర్డర్‌ మీద పసిడి టార్‌ జర్దోసీ ఎంబ్రాయిడరీతో దుర్గా మాత శ్లోకాన్ని డిజైన్‌ చేశారు. బ్లవుజు వింటేజ్‌ కోట్‌ శైలిలో తీర్చిదిద్దారు. ఈ డ్రెస్‌ రాధిక అందాన్ని రెట్టింపు చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. జతగా ఆమె తల్లి శైలా మర్చంట్‌ తన మామెరు లో వేసుకున్న నగల్నే ఇప్పుడు రాధిక ధరించింది. గోల్డ్‌ చోకర్, దానికి నప్పే జుంకాలు, గాజులు, మాంగ్‌ టిక్కాతో పాటు నవరత్నాలతో చేసిన గుజరాతీ శైలి మోడర్న్‌ బంగారు జడతో చూపు తిప్పుకోనివ్వలేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్