పట్టీకో లాకెట్టు!

చక్కని పట్టు పరికిణీ వేసి... చెవులకు బుట్టలు, మెడలో గొలుసు, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు... పెట్టుకొని అమ్మాయి ఇల్లంతా తిరుగుతోంటే ఆ ముచ్చటే వేరు.

Published : 09 Jul 2024 01:33 IST

చక్కని పట్టు పరికిణీ వేసి... చెవులకు బుట్టలు, మెడలో గొలుసు, చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు... పెట్టుకొని అమ్మాయి ఇల్లంతా తిరుగుతోంటే ఆ ముచ్చటే వేరు. కాళ్ల గజ్జెలు ఘల్లుఘల్లుమంటోంటే వినడానికి ఎంత హాయిగా ఉంటుంది? ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే... ఆ లక్ష్మీదేవే ఇంట్లో తిరుగుతోంది అనేయరూ! కానీ కాలేజీలు, ఆఫీసుల్లో అలా శబ్దం వస్తోంటేనేమో ఇతరులకు ఇబ్బంది. బోసిపోయిన కాళ్లేమో చూడటానికి అందంగా ఉండవు. ఈ చిక్కులను గమనించారేమో... పట్టీలను ఇలా తీర్చిదిద్దారు డిజైనర్లు. అమ్మాయిలు మెచ్చే మినిమల్‌ డిజైన్లలో రూపొందించేశారు. సన్నటి చెయిన్‌ లేదా ముత్యాల వరుసలకు చిన్న లాకెట్‌... భలే ముచ్చటగా లేవూ? తామర పువ్వు, నీటి బిందువు, ఆకులు... బోలెడు డిజైన్లలో వస్తున్నాయి. సంప్రదాయమైనా, ఆధునిక వస్త్రాలైనా ఇట్టే సరిపోతాయి. వెండి, జర్మన్‌ సిల్వర్‌ల్లో దొరుకుతున్నాయి. కొన్నింటికి బంగారు పూతనీ అద్దుతున్నారు. రంగుల రాళ్లు, ఎనామిల్‌ పెయింట్లతో మరింత ముచ్చటగా కనిపిస్తోన్న ఈ ‘స్టడెడ్‌ యాంక్లెట్స్‌’ మీ మనసూ దోచాయా? అయితే ఓ జత కొనిపెట్టేసుకోండి. మీ పాదాల వెంటే అందరి చూపులూ అనుసరిస్తాయంటే నమ్మండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్