ఆకట్టుకునేలా కనిపించాలంటే...

అందంగా, ఫ్యాషన్‌గా కనిపించాలని కోరుకునే అమ్మాయిలు... అందుకోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మరి మీరూ ఆ జాబితాలో ఉన్నారా...ఈ జాగ్రత్తలు మీకోసమే...ప్రాథమిక సూత్రం: అందంగా కనిపించాలంటే ఖరీదైన దుస్తులు...

Updated : 09 Dec 2022 13:06 IST

అందంగా, ఫ్యాషన్‌గా కనిపించాలని కోరుకునే అమ్మాయిలు... అందుకోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మరి మీరూ ఆ జాబితాలో ఉన్నారా...ఈ జాగ్రత్తలు మీకోసమే...ప్రాథమిక సూత్రం: అందంగా కనిపించాలంటే ఖరీదైన దుస్తులు, యాక్సెసరీలే వాడాల్సిన అవసరం లేదు. మీ ఆహార్యం ఆత్మవిశ్వాసంతో నిండుగా కనిపించేలా ఉంటే చాలు. దానికి తగినట్లుగా మీ వస్త్రధారణను తీర్చిదిద్దుకోవాలి.
క్యాజువల్స్‌: చాలామంది అమ్మాయిలు తమ దగ్గర ఎన్ని ఉన్నా... ఏవీ లేవనే బాధపడుతుంటారు. ఒకసారి వేసుకున్న దుస్తులు మళ్లీ పది రోజుల తరువాతే వాడాలని నియమం పెట్టుకోండి. మీ దగ్గర ఓ పది జతల దుస్తులు ఉన్నాయనుకోండి. వాటిని క్రమపద్ధతిలో ఏ రోజు ఏం వేసుకోవాలో ముందే నిర్ణయించుకోండి. దాని క్రమం తిరిగి వచ్చేటప్పటికి...మీకు అలాంటి ఆలోచన రాదు. వీటినే మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ తరహాలో ఇతర జతల్లోనూ భాగం చేయొచ్చు.
రిలాక్స్‌వేర్‌: కాలేజీ లేదా ఆఫీసు నుంచి వచ్చాక ఆ దుస్తుల్లోనే ఉండిపోతున్నారా... అప్పుడే వాటి నాణ్యత తగ్గుతుంది. ఇలాంటివారు కొన్ని జతల రిలాక్స్‌ వేర్‌ సిద్ధం చేసుకోవాలి. వీటిని రోజులో ఎప్పుడైనా వేసుకోవచ్చు.
పార్టీవేర్‌: ప్రతి పండక్కీ...ఒక కొత్త డ్రెస్‌ కొంటున్నా... ఒకసారి వేసుకుంది మరోసారి పాతదిలా భావిస్తారు కొందరు. కారణం వీటినీ మామూలు దుస్తుల్లో కలిపి పెట్టేయడం వల్లే. ఈసారి వాడిన దుస్తుల్ని నీడలో ఆరేసి లేదా డ్రైవాష్‌ చేయించి స్టోరేజ్‌ బ్యాగ్‌లో పెట్టేస్తే...రంగు పోకుండా వాటికున్న ఎంబ్రాయిడరీ హంగులు పాడవకుండా ఉంటాయి. ఆ డ్రెస్‌ ఎప్పుడు వేసుకున్నా కొత్తగానే కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్