Updated : 05/06/2021 20:06 IST

Health Tips: మెంతులు... ప్రయోజనాలు బోలెడు

మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మహిళలకు మరీ మంచిది. రోజూ తీసుకుంటే మేలంటున్నారు నిపుణులు...
బాలింతలకు మెంతికూర పప్పు, మెంతులు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణులకు ప్రసవాన్ని సులభతరం చేస్తుంది. మెంతులతో గర్భాశయ వ్యాధులు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవం తర్వాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవుతుంది.
* కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లలో లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
* మధుమేహులు మెంతుల్ని రోజుకి 3 సార్లు తీసుకుంటే డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది. మలబద్ధకం ఉన్నప్పుడు 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
* మెంతులు, తేనె, నిమ్మరసం కలిపి కషాయంలా తాగితే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని