మార్పులొస్తున్నా మూగనోమేనా!
మహిళల నెలసరిపై కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని ఓ సర్వే తేల్చింది. సక్రమంగా రాకపోవడం, రక్తస్రావంలోనూ మార్పులు వంటి పలు అంశాలు ఈ సర్వేలో వెల్లడయ్యాయి. ‘ద సిక్స్త్ యాన్యువల్ మెనస్ట్రువల్ హైజీన్ సర్వే’ పేరుతో ఎవర్టీన్ సంస్థ నిర్వహించిన సర్వే 41 శాతం మంది మహిళల్లో నెలసరిలో పలు తేడాలను గుర్తించింది....
మహిళల నెలసరిపై కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని ఓ సర్వే తేల్చింది. సక్రమంగా రాకపోవడం, రక్తస్రావంలోనూ మార్పులు వంటి పలు అంశాలు ఈ సర్వేలో వెల్లడయ్యాయి.
‘ద సిక్స్త్ యాన్యువల్ మెనస్ట్రువల్ హైజీన్ సర్వే’ పేరుతో ఎవర్టీన్ సంస్థ నిర్వహించిన సర్వే 41 శాతం మంది మహిళల్లో నెలసరిలో పలు తేడాలను గుర్తించింది. కొవిడ్, లాక్‌డౌన్‌తో తీవ్ర ఒత్తిడి, ఆందోళన దీనికి కారణం కావొచ్చని ఆ సర్వే భావించింది. హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాల్లో 18 నుంచి 35 ఏళ్లలోపున్న 5000 మంది మహిళలపై ఈ సర్వే నిర్వహించారు. వీరిలో 13.7 శాతం మంది కొవిడ్ బారిన పడగా, తీవ్ర ఒత్తిడి, ఆందోళనల ప్రభావం 64.5 శాతం మంది నెలసరిపై పడిందని భావిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో రక్తస్రావంలో తేడాలు, తీవ్రమైన కడుపునొప్పి, నెలసరి క్రమం తప్పడం వంటివి కనిపించాయి. అయినప్పటికీ 25.5 శాతం మంది మాత్రమే వైద్యులను సంప్రదించారు. 43.8 శాతం మంది కనీసం వీటి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదని చెబుతోంది ఈ అధ్యయనం. అలానే దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు శానిటరీ న్యాప్కిన్స్ లేక ఇబ్బంది పడ్డారంటోంది. వారంతా ప్రభుత్వం తమకు తేలిగ్గా వీటిని అందించేలా చూడాలనీ ఈ సంస్థను కోరారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ గింజలతో అందంగా మెరిసిపోదాం!
- ఫోనుకో క్యూట్ లుక్!
- చెమట ఎక్కువగా పడుతోందా?
- జోరుమీదున్నాయి... జిప్ నగలు!
- స్పోర్ట్స్ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?
ఆరోగ్యమస్తు
- పురుటినొప్పులు మగవారికి కూడా..!
- మీ కోసమే ఈ ‘ఎవ్రీథింగ్’!
- ఆహారంలో ఇవి ఉన్నాయా?
- ఈ అలవాట్లు మార్చుకుంటే.. కాలేయం పదిలం!
- బరువు తగ్గించే ‘బీరకాయ సూప్’!
అనుబంధం
- నేనంటే ప్రాణమంటోంది.. కానీ!
- ‘ఇంటి నుంచి వెళ్లిపో’ అంటున్నాడు..!
- అపరాధ భావం లేకుండా...
- గర్భస్రావం అయ్యాక..!
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
యూత్ కార్నర్
- Japnit Ahuja : మాతృభాషలో కోడింగ్ పాఠాలు!
- తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు... కూతురు అగ్నివీర్!
- UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!
- గెలుపు కథ రాసుకున్నారు!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
'స్వీట్' హోం
- చూయింగ్ గమ్‌ని వదిలించాలంటే..!
- వంటిల్లు పొందిగ్గా
- మామిడి పండు ఇడ్లీలు!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
వర్క్ & లైఫ్
- కండరాల బలానికి వశిష్ఠాసనం..!
- ప్రయాణాల కోసం ‘సోప్ పేపర్’!
- నెలసరి కాలుష్యం లేకుండా!
- నిండైన నీల లత అందం!
- ఇంటికో సీతమ్మ తల్లి!