కంటిచూపునకు కాసిని జాగ్రత్తలు

ఒకప్పుడు వృద్ధాప్యంలో కళ్లజోళ్లు వచ్చేవి. ఒత్తిడి, ఆహారలోపం, కంప్యూటర్‌ వాడకం లాంటి కారణాలతో పిన్న వయసులోనే చూపు తగ్గిపోతోంది.

Updated : 07 Jul 2021 05:03 IST

ఒకప్పుడు వృద్ధాప్యంలో కళ్లజోళ్లు వచ్చేవి. ఒత్తిడి, ఆహారలోపం, కంప్యూటర్‌ వాడకం లాంటి కారణాలతో పిన్న వయసులోనే చూపు తగ్గిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలేంటో చూద్దాం...

చూపు బాగుంటేనే ఇంటాబయటా పనులన్నీ చక్కబెట్టుకోగలం. అందుగ్గానూ మొట్టమొదట చేయాల్సింది సంపూర్ణ పోషకాహారం తినడం. పాలు, పెరుగు, వెన్న, గుడ్డు, క్యారెట్‌, టమాట, బీన్స్‌, చిలగడదుంప, మామిడి, కమలా, ద్రాక్ష, బ్రొకొలి, అక్రోట్లు, జీడిపప్పు, చీజ్‌ మొదలైన ఎ-విటమిన్‌ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.

* కాటుక, ఐలైనర్లు నాణ్యమైనవే వాడాలి. లేదంటే కళ్ల సమస్యలు రావచ్చు.

* కంప్యూటర్‌పై పని చేసేవాళ్లు తరచూ రెప్పలార్పుతూ ఉండాలి. ప్రతి 20 నిమిషాలకూ చూపును మళ్లించి 20 అడుగుల దూరానున్న వస్తువును 20 క్షణాలపాటు చూడాలి. కంప్యూటర్‌ స్క్రీన్‌ కంటికి కనీసం 20 అంగుళాల దూరంలో ఉండాలి. స్క్రీన్‌ పైభాగం కళ్లకి కాస్త దిగువన ఉండేలా అమర్చుకోవాలి. గ్లేర్‌ పడకుండా చూసుకోవాలి.

* కాంటాక్ట్‌ లెన్స్‌ వాడేవారు ముందు చేతులను శుభ్ర పరచుకోవాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

* టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారు మందులు క్రమం తప్పక వాడాలి. లేదంటే కంటిచూపు తగ్గే ప్రమాదముంది.

* చూపులో ఇబ్బంది కలిగినా, ఇతరత్రా కంటి సమస్యలు వచ్చినా జాప్యం చేయకుండా కళ్ల డాక్టరును సంప్రదించాలి.

* ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత నిద్ర అవసరం. నిద్రలేమితోనూ చూపు సమస్యలు వస్తాయి. కళ్లకు వ్యాయామం అవసరం. తల కదపకుండా అన్నివైపులకూ చూపు సారించే కంటి వ్యాయామం చేయాలి.

* ఎప్పుడైనా కళ్లు దురదగా అనిపిస్తే చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.

* ఎండలో వెళ్లేటప్పుడు చలువ కళ్లద్దాలు ధరించడం మంచిది.

* రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల కూడా కళ్లు తేటగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్