రక్తహీనతను తగ్గించే బచ్చలి

సాధారణంగా మహిళల ప్రధాన సమస్య రక్తహీనత. దీనికి మంచి మందు బచ్చలి. అదే కాదు ఇంకా ప్రయోజనాలున్నాయి... అవేంటో చూడండి!

Updated : 17 Jul 2021 01:21 IST

సాధారణంగా మహిళల ప్రధాన సమస్య రక్తహీనత. దీనికి మంచి మందు బచ్చలి. అదే కాదు ఇంకా ప్రయోజనాలున్నాయి... అవేంటో చూడండి!

బచ్చలిలో ‘విటమిన్‌-సి’ అధికం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్‌ అపారం. సెలీనియం, నియాసిన్‌, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లూ పుష్కలంగానే దొరుకుతాయి. ఇవి మెదడు, నరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

* ఇందులోని ‘విటమిన్‌-ఎ’ కంటి చూపుని మెరుగు పరుస్తుంది. దృష్టి దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా బచ్చలి కూర తింటే మేలు. ఈ ఆకు కూరలో ఉండే ల్యూటిన్‌ కంటి చూపునకు దోహదపడి రెటీనాను మెరుగు పరుస్తుంది. అలానే విటమిన్‌కె రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది.

* బచ్చలి కూరలో ఐరన్‌ మోతాదూ ఎక్కువే. రక్తహీనతతో బాధపడేవారు క్రమం తప్పక తీసుకుంటే మేలు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది కూడా. గర్భిణుల్లో మలబద్ధకం ఏర్పడకుండా చూస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్