అల్పాహారానికి బదులుగా..

ఉదయం నుంచి భర్త, పిల్లలకు ఇష్టమైనవి వండిపెట్టి వారికి వడ్డించే సుధ తన గురించి అనాసక్తిగా ఉంటుంది. హడావుడిగా ఏదో ఒకటి తింటుంది. దాంతో తరచూ అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటుంది.

Updated : 18 Jul 2021 04:30 IST

ఉదయం నుంచి భర్త, పిల్లలకు ఇష్టమైనవి వండిపెట్టి వారికి వడ్డించే సుధ తన గురించి అనాసక్తిగా ఉంటుంది. హడావుడిగా ఏదో ఒకటి తింటుంది. దాంతో తరచూ అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటుంది. ఉదయాన్నే పోషకాలతో కూడిన ఆహారాన్ని ఎంపిక చేసుకోకపోతే ఇలానే అవుతుందని హెచ్చరిస్తున్నారు ఆహార నిపుణులు. అల్పాహారానికి తీరిక లేకపోతే, తక్కువ సమయంలోనే ఎక్కువ పౌష్టిక విలువలుండే ఆహారాన్ని ఇలా చేసుకోవచ్చు...

* రుచికరమైన స్మూతీ..

అల్పాహారం చాలా ముఖ్యమైంది. అందుకే పోషకాలుండే స్మూతీని ఎంపిక చేసుకోవాలి. అదెలాగంటే... చిన్నగా తరిగిన అరకప్పు ఆకుకూర, పావుకప్పు కీరదోస ముక్కలు, సగం అరటి పండు, కప్పు గ్రీన్‌ యాపిల్‌ ముక్కలు, ఒక్కో చెంచా నిమ్మరసం, తేనె, వీలుంటే పావుకప్పు స్ట్రాబెర్రీ ముక్కలను వేసి మిక్సీలో వేస్తే చాలు.. స్మూతీ అవుతుంది. అవసరం మేరకు తేనెను కలుపుకొంటే మరింత రుచి వస్తుంది. ఈ స్మూతీ ద్వారా పోషకాలెన్నో అందుతాయి.

* ఓట్స్‌తో.. ఓట్స్‌ను మెత్తని పొడి చేసుకుని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఉదయంపూట ఓ గిన్నెలోకి రెండు లేదా మూడు చెంచాల పొడి వేసి అందులో మరిగించిన గ్లాసు నీటిని పోయాలి. దాంట్లో అరటిపండు ముక్కలు, రాత్రి నానబెట్టి ఉంచిన మూడు బాదంపప్పులు, నాలుగు జీడిపప్పులు, చెంచా దానిమ్మ గింజలు వేసుకోవాలి. తీపికి తగ్గట్లుగా రెండుచెంచాల తేనె కలిపితే చాలు. అయిదు నిమిషాల్లో మంచి పుష్టికరమైన అల్పాహారం సిద్ధమవుతుంది. ఓట్స్‌ హృద్రోగాలను దరి చేరకుండా చేయడమే కాదు, అందులోని పీచు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

* గుడ్లతో...

మార్కెట్లో రకరకాల బ్రెడ్స్‌ లభ్యమవుతున్నాయి. నాలుగు బ్రడ్‌ ముక్కలు తీసుకోవాలి. ముందుగా పాన్‌లో బటర్‌ వేసి వేడిచేసి విడిగా తీసుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో రెండు కోడిగుడ్లు కొట్టి ఆమ్లెట్‌గా వేసి, కాస్తంత మిరియాల పొడి, ఉప్పు చల్లి దానిపై వేడి చేసిన బ్రెడ్‌స్లైడ్స్‌ను ఉంచి మూత పెట్టాలి. రెండు నిమిషాలకు రుచికరమైన, పోషక విలువలున్న బ్రేక్‌ఫాస్ట్‌ రడీ అవుతుంది. మరింకెందుకు ఆలస్యం...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్