ఇంటినే జిమ్‌గా మార్చేద్దామా...

కొవిడ్‌ భయం ఇంకా పోలేదు. ఈ సమయంలో బయటకెళ్లి కసరత్తులు చేయడానికి ఇబ్బందిగా ఉందా? అయితే ఇంటినే జిమ్‌గా మార్చుకోండి!

Updated : 04 Aug 2021 04:15 IST

కొవిడ్‌ భయం ఇంకా పోలేదు. ఈ సమయంలో బయటకెళ్లి కసరత్తులు చేయడానికి ఇబ్బందిగా ఉందా? అయితే ఇంటినే జిమ్‌గా మార్చుకోండి!

యోగా మ్యాట్‌ మొదలుకుని మీరు ఏయే వ్యాయామ పరికరాలు వాడాలని అనుకుంటున్నారో... వాటికి సరిపోయే చోటును ఎంచుకోండి. స్పష్టంగా చెప్పాలంటే మీరు కాళ్లు, చేతులు చాపడానికి కావాల్సిన స్థలం సరిపోతుంది. అంతేకాదు వ్యాయామం చేసే చోట ఏ అంతరాయమూ కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా టీవీ గదిలోనో, డైనింగ్‌ హాలుకు దగ్గరగా అస్సలు ఉండద్దు.

* ప్రణాళిక... ముందిది సిద్ధం చేసుకోండి. ఎన్ని రోజుల్లో ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో, ఏయే భాగాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారో పుస్తకంలో స్పష్టంగా రాసుకోండి. డంబెల్స్‌, రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌, కెటిల్‌ బెల్స్‌, యోగా మ్యాట్‌, ఫోమ్‌ రోలర్‌ను సిద్ధం చేసుకోండి.

* అద్దం... మీరెలా వ్యాయామాలు చేస్తున్నారో చూడటానికి ఓ అద్దం కావాల్సిందే. ఇది మీ వ్యాయామ ప్రదేశాన్నీ పెద్దదిగా చూపిస్తుంది.

* ట్రాకర్‌... ఏయే వ్యాయామాలు ఎంత సేపు చేస్తున్నారు? ఎంత విశ్రాంతి కావాలి... లాంటివన్నీ కచ్చితంగా పరిశీలించడానికి ఇది తప్పనిసరి.

... ఇంకేముంది... వ్యాయామం ప్రారంభించడమే. ఆల్‌ది బెస్ట్‌!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్