బరువు తగ్గడం లేదా....

కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా బరువు తగ్గరు. అన్నీ సరిగ్గానే చేస్తున్నా కదా అనుకుంటారు. అందుకు గల కారణాలేంటో తెలుసుకుందామా...

Updated : 08 Aug 2021 05:06 IST

కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా బరువు తగ్గరు. అన్నీ సరిగ్గానే చేస్తున్నా కదా అనుకుంటారు. అందుకు గల కారణాలేంటో తెలుసుకుందామా...

అతిగా వ్యాయామాలు చేయడమే. ఎంత చక్కటి వర్కవుటైనా... ఇన్నిసార్లు... ఇంతసేపు చేయాలనే నియమం ఉంటుంది. అలా కాకుండా త్వరగా బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి  క్రమపద్ధతిలో చేయాలి. మధ్య మధ్యలో విరామాలూ తప్పనిసరి.

* నిద్ర లేకపోవడం... కంటి నిండా నిద్ర పోకపోతే జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కూడా బరువు పెరుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి.

* రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజూ ఒకే సమయానికి నిద్రపోయేందుకు ప్రయత్నించాలి.

* సరిపడా తినక... అవును మీరు చదివింది కరెక్టే. మీ శరీరానికి సరిపడా ఆహారం తీసుకోకపోతే మీ మెదడు ఇప్పటికే ఉన్న కొవ్వు నిల్వలను ఎక్కువగా ఖర్చు చేయదు. జీవ క్రియలూ మందగిస్తాయి. దాంతో కెలొరీలు ఖర్చు కావు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఆహారం మానేయకుండా పోషకభరితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి.

* అతిగా తినడం... బరువు తగ్గాలనుకునే వాళ్లు ఆహారం మీద నియంత్రణ తెచ్చుకోవాలి. ఆకలిని పెంచే జ్యూస్‌లు, కెలొరీలు ఎక్కువగా ఉండే శీతల పానీయాలు తీసుకోవద్దు. వీటికి ప్రత్యామ్నాయంగా నీళ్లు తాగండి. పోషకాలుండే ఆహారం అదీ మితంగా తీసుకోండి.

* పిండిపదార్థాలు.. కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉండే బియ్యం, చక్కెర, బ్రెడ్‌ లాంటివి వీలైనంత వరకు తగ్గించాలి. వీటి నుంచి అందే పోషకాలు తక్కువ. అలాగే ఎక్కువ మొత్తంలో గ్లైసిమిక్‌ లభ్యమవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను పెంచి బరువు తగ్గకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్