నిద్ర.. నాణ్యంగా పోండి
close
Updated : 10/08/2021 05:02 IST

నిద్ర.. నాణ్యంగా పోండి!

కుటుంబానికి అన్నీ సమకూర్చే క్రమంలో పొద్దున్నే లేవడం, ఆలస్యంగా నిద్రపోవడం మహిళలకు సాధారణం. ఉద్యోగంలో ఉన్న వారి సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ నిద్రా సమయం, గాఢత ఏది తగ్గినా ప్రమాదమే. నిపుణులేమంటున్నారంటే...
శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్రా అంతే ముఖ్యం. నిద్ర సరిగా లేకపోతే బరువు పెరగడం, ఇమ్యూనిటీ తగ్గడం, భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో సమస్యలొస్తాయి. జీవగడియారం దెబ్బతింటుంది. పొద్దున్నే నిస్సత్తువగా ఉండటమే కాకుండా జుట్టు ఊడటం, అరుగుదల సరిగా లేకపోవడం వంటి వాటికీ కారణమవుతుంది.
నిద్రలేమి విపరీతమైన ఒత్తిడి, ఆందోళనతోపాటు ఇతర సమస్యలకూ దారి తీస్తుంది. కోపం, దేనిమీదా దృష్టి పెట్టలేకపోవడం, ఆకలి లేకపోవడం, త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడం, కళ్లకింద వాపులను కలిగిస్తుంది. దీర్ఘకాల వ్యాధులకూ దారితీస్తుంది. కాబట్టి, కనీసం ఏడు గంటలు అదీ నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్రపోయే ముందు ఆరోజు ఆందోళన కలిగించినవీ, మరుసటి రోజు చేయాల్సిన వాటి గురించి ఆలోచించొద్దు. ఆహ్లాదకర సంగీతం, ఎసెన్షియల్‌ నూనెలు సాంత్వన కలిగించడమే కాక గాఢనిద్రనీ ఇస్తాయి. కాలానికి తగ్గట్టుగా దిండ్లు, దుప్పట్లను మార్చుకోవాలి. ఇవీ ముఖ్యమే.


Advertisement

మరిన్ని