అలసటగా ఉంటోందా..!

కాలంతో పరుగులు, ఒకేసారి ఎన్నో పనులు... మహిళలకు సాధారణమే! ఫలితంగా అలసిపోతుంటారు. దీనిపై ఆహార ప్రభావమూ ఉంటుందట. అదేంటో చూసి తగ్గ మార్పులు చేసుకోవాలి మరి!

Updated : 27 Aug 2021 00:40 IST

కాలంతో పరుగులు, ఒకేసారి ఎన్నో పనులు... మహిళలకు సాధారణమే! ఫలితంగా అలసిపోతుంటారు. దీనిపై ఆహార ప్రభావమూ ఉంటుందట. అదేంటో చూసి తగ్గ మార్పులు చేసుకోవాలి మరి!

అల్పాహారం: చాలామంది మహిళలు పనిలో పడి దీన్ని మానేస్తుంటారు. లేదా హడావుడిగా ఏదో ఒకటి తినేస్తుంటారు. రెండూ తప్పే. లేచిన రెండు గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్‌ తప్పక చేయాలి. దానిలో చక్కెరలు తక్కువ, ఫైబర్‌ ఎక్కువ ఉండాలి.

ప్రొటీన్‌: రక్తంలో చక్కెరలు తగ్గడమే నీరసం, అలసటకు ప్రధాన కారణం. కొన్ని సమయాల్లో ఉత్సాహం, కొన్నిసార్లు మరీ నీరసం గమనిస్తుంటాం. అందుకే ఆహారంలో ప్రొటీన్లను ఎక్కువగా చేర్చుకోండి. ఇవి రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. గోధుమ, ముడి బియ్యం, నట్స్‌, విత్తనాలు, ఓట్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఐరన్‌ శాతం తగ్గడమూ అలసటకు కారణమవుతుంది. దీన్ని పెంచుకోవాలంటే ఆకుకూరలు, కూరగాయలు, మాంసానికి ప్రాధాన్యమివ్వాలి. వైద్యుల సలహాతో సప్లిమెంట్‌నూ వాడొచ్చు.

దూరం: రిఫైన్డ్‌, నిల్వ ఆహారాలకు దూరంగా ఉండాలి. తక్షణ శక్తికి, చురుకుదనానికి కాఫీ, టీలపై ఆధార పడుతుంటారు. కానీ వీటిలో ఉండే కెఫిన్‌ శరీరంలో చాలా సేపు నిల్వ ఉండి నిద్రపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, పరిమితంగా తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్